Salman Khan: తనకు ఇటీవల వచ్చిన బెదిరింపు లేఖల నేపథ్యంలో స్వీయ రక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న నటుడు సల్మాన్ ఖాన్‌కు ఆయుధాల లైసెన్స్ జారీ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. మే 29న పంజాబ్‌లోని మాన్సా సమీపంలో గాయకుడు సిద్ధూ మూసేవాలాను కాల్చి చంపిన కొద్ది రోజులకే, జూన్ ప్రారంభంలో సల్మాన్‌ఖాన్, అతని తండ్రికి చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గత నెలలో సల్మాన్ ముంబై పోలీస్ కమిషనర్ ఫన్ సల్కార్‌ను కలిసి గన్ లైసెన్స్ కోసం వినతిని సమర్పించారు. బెదిరింపు లేఖ నేపథ్యంలో సల్మాన్ తనకు తుపాకీ లైసెన్సు జారీ చేయాలని పెట్టిన వినతి లేఖకు ముంబయి జోనల్ డీసీపీ సిఫారసు చేశారు. ఆ తర్వాత లైసెన్స్ జారీ కోసం పోలీస్ శాఖ అవసరమైన విచారణను ప్రారంభించింది.
NIA: ఉగ్రకదలికలపై ఎన్‌ఐఏ సోదాలు.. ఆదివారం పలు రాష్ట్రాల్లో దాడులు
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు తుపాకీ లైసెన్సు మంజూరు చేస్తూ ముంబయి పోలీసులు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరించిన నేపథ్యంలో అతనికి తుపాకీ లైసెన్సును మంజూరు చేస్తూ ముంబయి పోలీసు కమిషనర్ వివేక్ ఫన్ సల్కార్ నిర్ణయం తీసుకున్నారు. బెదిరింపుల తర్వాత సల్మాన్ ఖాన్ పకడ్బందీ సెక్యూరిటీ చర్యలు తీసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ మరణ బెదిరింపు 1998 నాటి కృష్ణ జింకలను వేటాడిన కేసుతో ముడిపడి ఉంది, ఇందులో నటుడు నిందితులలో ఒకడు. సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్నప్పుడు, బిష్ణోయ్ తన కమ్యూనిటీలో కృష్ణజింకలను పవిత్రంగా పరిగణిస్తున్నందున సల్మాన్‌ను బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి.