NTV Telugu Site icon

Powerful Dance: నడి రోడ్డుపై డాన్స్ చేసిన హీరోయిన్.. వీడియో వైరల్..

Moksha Sen Gupta

Moksha Sen Gupta

Powerful Dance: గత నెల నుంచి కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ఎంతటి విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఘటనపై దేశం నలుమూలలా నిరసనలు వెల్లువెత్తాయి. ఇప్పటికే పలువురు ఈ ఘటనను ఖండిస్తున్నారు. తాజాగా డాక్టర్ హత్య ఘటనపై ఓ హీరోయిన్ భిన్నంగా నిరసన తెలిపింది. రోడ్డు మీదకు వచ్చి డ్యాన్స్ చేస్తోంది. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.

Read also: HMD Skyline Price: హెచ్‌ఎండీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. డిస్‌ప్లే, బ్యాటరీని రీప్లేస్‌ చేసుకోవచ్చు!

సెలబ్రిటీలు బయటకు వచ్చి నిరసన తెలిపితే ప్రభుత్వం త్వరగా స్పందిస్తుందని పలువురు నెటిజన్లు, అభిమానులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇలా రోడ్డుపై డ్యాన్స్ చేసిన హీరోయిన్ ఈ మోక్షసేన్ గుప్తా. ఈ ముద్దుగుమ్మ బెంగాల్ ప్రాంతానికి చెందింది. మోక్ష సేన్‌గుప్తా టీచర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. తర్వాత నటనపై దృష్టి సారించింది. మొదటగా తాను బెంగాలీ సినిమాల్లో నటించింది. తర్వాత సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం ఘటన జరిగిన సమయంలో తాను హైదరాబాద్‌లో ఉన్నానని, విషయం తెలిసిన వెంటనే బెంగాల్‌కు వచ్చానని మోక్ష వివరించాడు. ఓ కళాకారిణిగా నిరసన తెలిపానని పేర్కొన్నారు. కళ ద్వారా సమస్యను వివరించే ప్రయత్నం చేశానన్నారు. ఈమె నీతోనే నేను, అలనాటి రామచంద్రుడు, ఐ హేట్ యు తదితర చిత్రాలలో కూడా నటించింది. ధనరాజు, సముద్రఖని కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న చిత్రంలో కూడా మోక్షసేన్ గుప్తా నటిస్తున్నదట. అంతేకాదు ఈ సినిమాలే కాకుండా.. తెలుగులో మరికొన్ని చిత్రాలలో నటిస్తున్న ఈ బెంగాలీ భామ ఇలా రోడ్డుపైన డాన్స్ చేయడంతో చాలామంది ఈమెను మెచ్చుకుంటున్నారు. అయితే..వైద్యురాలిపై దారుణానికి ఒడిగట్టిన అందరిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. కోల్ కతా వైద్యురాలి మృతిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన తెలియజేస్తున్న విషయం తెలిసిందే.
Andhra Pradesh: ఇవాళ ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశం.. ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం

Show comments