గోవాలో మంత్రి నీల్‌కాంత్ హలాంకర్ కారును అడ్డుకున్న నటుడు గౌరవ్ బక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెబ్ సిరీస్‌లు, కొన్ని చిత్రాల్లో నటించిన బక్షి.. ఓ కార్యక్రమంలో మంత్రి కారును అడ్డుకున్నారు. దీంతో హలర్ంకర్ వ్యక్తిగత భద్రతా అధికారి (పీఎస్‌వో) నార్త్ గోవా జిల్లాలోని కోల్‌వాలే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నటుడిని అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: SKN: మాటిచ్చాడు.. ఆటో కొనిపెట్టాడు..ఎస్కేఎన్ వీడియో వైరల్
నీల్‌కాంత్ హలాంకర్.. గోవాలోని పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే నటుడు గౌవర్ బక్షి.. మంత్రి కారును అడ్డుకున్నారు. మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఫిర్యాదు మేరకు గౌరవ్ బక్షిని గోవా పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. గౌవర్ బక్షి.. వెబ్ సిరీస్‌లు మరియు కొన్ని చిత్రాల్లో నటించినట్లుగా తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ సేవకుడిని అడ్డుకోవడంతో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద నటుడిపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. బుధవారం ఉత్తర గోవా జిల్లాలోని రెవోరా పంచాయతీ హాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని కారులో బయలుదేరుతుండగా ఈ ఘటన జరిగిందని మంత్రి విలేకరులకు తెలిపారు. నటుడు మంత్రి కారును అడ్డుకోవడం.. అనంతరం మంత్రి కార్యదర్శిని బెదిరించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Shock to BRS: బీఆర్‌ఎస్‌కు భారీ షాక్.. రేపు కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే!
ఇక పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో మంత్రిపై కూడా ఫిర్యాదు చేసినట్లు గౌరవ్ బక్షి వీడియో ద్వారా తెలియజేశాడు. ఇక ఈ ఘటనపై ప్రభుత్వం దృష్టిసారించిందని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. గౌరవ బక్షి అరెస్ట్ అవుతాడని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గౌరవ్ బక్షి… ‘బాంబే బేగమ్స్’, ‘నక్సల్బరీ’ అనే వెబ్ సిరీస్‌ల్లో నటించారు. అలాగే గోవాలో స్టార్టప్‌ను కూడా నటుడు నడుపుతున్నాడు.
ఇది కూడా చదవండి: Punjab: పుట్టింటి నుంచి భార్యను తీసుకురావడానికి వెళ్లిన భర్తకు నిప్పు..