NTV Telugu Site icon

Actor Darshan: జైల్లో టీవీ కోసం రిక్వెస్ట్.. అంగీకరించిన అధికారులు

Actordarshan

Actordarshan

వినాయక చవితి పండుగ రోజున కన్నడ నడుటు దర్శన్‌కు అధికారులు 32 అంగుళాల టీవీని అందించారు. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ జైల్లో ఉంటున్నారు. అయితే తనకు టీవీ సౌకర్యం కల్పించాలని దర్శన్ అభ్యర్థించాడు. దీంతో అతడి మనివి అంగీకరించిన అధికారులు.. శనివారం అతడు ఉంటున్న జైలు గదిలో 32 అంగుళాల టెలివిజన్ ఏర్పాటు చేశారు. తన కేసు విచారణ విషయాలు, అలాగే బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు తన గదిలో టీవీ ఏర్పాటు చేయాలని గత వారం అధికారులు దర్శన్ రిక్వెస్ట్ పెట్టాడు. మొత్తానికి పండుగ పూట దర్శన్‌కు ఊరట లభించింది. దర్శన్ అభ్యర్థనను మన్నించి శనివారం టీవీ ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి: Maharashtra: “ద్రోహం చేసిన నా కుమార్తె, అల్లుడిని ప్రాణహితలో పారేయండి”.. మంత్రి సంచలన వ్యాఖ్యలు..

రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్, అతడి ప్రియురాలు పవిత్ర గౌడ్‌తో సహా మరో 15 మంది జైల్లో ఉన్నారు. ఇక రేణుకాస్వామిని అత్యంత క్రూరంగా చంపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కిడ్నాప్ చేసి క్రూరంగా హింసించి చంపేశారు. ఈ కేసులో కొన్ని రోజుల నుంచి వారంతా జైల్లో మగ్గుతున్నారు. ఇటీవల దర్శన్.. జైల్లో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడంటూ కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దీంతో ప్రభుత్వం.. మరో జైలుకు తరలించారు. అయితే తనకు టీవీ ఏర్పాటు చేయాలని కోరగా.. శనివారం తెల్లవారుజామున దర్శన్ సెల్‌లో 32 అంగుళాల టెలివిజన్‌ను అమర్చేందుకు జైలు అధికారులు అనుమతించారని వర్గాలు తెలిపాయి. తన కేసులో ఛార్జిషీట్ సమర్పణకు సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నానని మరియు బయటి ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉందని పేర్కొన్నాడు.

ఇది కూడా చదవండి: Noida: విషాదం.. కూలిన ఇంటి పైకప్పు, నలుగురి పరిస్థితి విషమం

జైలు మార్గదర్శకాల ప్రకారం టెలివిజన్‌ను అందించాలనే నిబంధన ఉందని, టెలివిజన్‌ను రిపేర్ చేయాల్సి ఉన్నందున ఆలస్యం జరిగిందని వర్గాలు తెలిపాయి. దర్శన్ తన సెల్‌లో అందుబాటులో ఉన్న ఇండియన్ టాయిలెట్‌ను ఉపయోగించుకోలేక పోవడంతో సర్జికల్ చైర్ కోసం దర్శన్ చేసిన అభ్యర్థనను జైలు అధికారులు అంతకుముందు అంగీకరించారు. దర్శన్ తనకు అనుమతి ఉన్న ఫోన్ కాల్స్ చేయడానికి అనుమతిని కూడా అభ్యర్థించాడు. ఖైదీ ప్రైవేట్ ఖాతాలో రూ. 35,000 జమ అయిందని, జైలు క్యాంటీన్ నుంచి ఆర్డర్ చేసిన టీ మరియు కాఫీకి రూ. 735 ఖర్చు చేశాడని వారు తెలిపారు. దర్శన్‌పై ఛార్జ్‌షీట్‌ను సమర్పించిన నేపథ్యంలో అతడిపై ఒత్తిడి ఉందని, పరిణామాలపై ఆందోళన చెందుతున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి.

ఇది కూడా చదవండి: Afzal Guru: “అఫ్జల్ గురుని ఉరితీయడం వల్ల లాభం లేదు”.. ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..

రేణుకాస్వామిని బందీగా ఉంచిన సమయంలో దర్శన్ అతనిపై చేసిన క్రూరత్వాన్ని ఛార్జ్ షీట్‌లో వెల్లడించింది. దర్శన్, ఇతర నిందితులు రేణుకాస్వామి శాఖాహారి అని తెలిసి మాంసాహారం తినమని బలవంతం చేశారని అందులో పేర్కొన్నారు. రేణుకాస్వామి బిర్యానీ ఉమ్మివేసినప్పుడు.. ఆహారాన్ని ఉమ్మివేసినందుకు దర్శన్ అతనిని తన్నాడు. రేణుకాస్వామికి తీవ్రగాయాలై రక్తస్రావం కావడంతో దర్శన్ అతడిని పదే పదే తన్నాడు. దర్శన్ ఆ తర్వాత రేణుకస్వామి రక్తపు జాడలు ఉన్న షూస్ ధరించి మైసూరు నగరానికి వెళ్లాడు. అయితే మరుసటి రోజు ఉదయం పోలీసులు దర్శన్‌ను అరెస్టు చేసినప్పుడు వేరే జత బూట్లు ధరించాడు. హోటల్ సిబ్బంది అతని రక్తంతో తడిసిన బూట్లు మరియు ఇతర వస్తువులను ప్యాక్ చేసి బెంగళూరులోని దర్శన్ భార్య విజయలక్ష్మి నివాసానికి పంపారు. అనంతరం విజయలక్ష్మి నివాసంలో దర్శన్‌కు చెందిన అన్ని వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యలో దర్శన్ ప్రమేయం ఉందని రుజువు చేయడానికి దర్శన్ బూట్లపై ఉన్న రక్తపు మరక ఈ కేసులో కీలకమైన సాక్ష్యాలలో ఒకటి అని వర్గాలు తెలిపాయి.