NTV Telugu Site icon

Social Media: యాక్టివ్‌ సోషల్‌ మీడియా.. 64 శాతం మంది ఆన్‌లైన్‌లోనే

Social Media

Social Media

Social Media: సమాజంలోని 80 శాతానికిపైగా ప్రజల చేతుల్లో స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి. వాటిలో 90 శాతం మందికిపైగా సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నారు. కొందరైతే సోషల్‌ మీడియాలో ఉన్న వాటన్నింటిని ఉపయోగిస్తున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా లేని వారు చాలా తక్కువగా ఉంటారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా్గ్రామ్‌, ట్విట్టర్‌, రీల్స్, టెలీగ్రామ్‌ ఇలా అనేక రకాల సోషల్‌ మీడియాలో స్మార్ట్ ఫోన్‌ ఉన్నవారు ఏదో ఒకదాంట్లో ఉంటారు. నిరంతరం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు కూడా ఉంటున్నారు. మనిషి లేచిన దగ్గరి నుంచి పడుకొనే వరకు తనతోపాటు ఫోన్‌ను వదల కుండా ఉంటాడు. లేవగానే మొదట చూసుకునేది తన స్మార్ట్ ఫోన్‌నే. స్మార్ట్ ఫోన్‌తో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు ప్రపంచ జనాభాలో 64 శాతానికిపైగా ఉన్నారంటే.. నమ్మకం తప్పదు. ప్రపంచ జనాభాలో 500 కోట్ల మందికిపైగా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారని ఒక సర్వేలో వెల్లడయింది.

Read also: Hebah Patel : ఘాటైనా అందాలతో రెచ్చగొడుతున్న హెబా పటేల్..

ప్రపంచ వ్యాప్తంగా సోషల్‌ మీడియా వినియోగదారుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇంటర్నెట్‌ సదుపాయం అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మందికిపైగా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అధ్యయనం ప్రకారం ప్రపంచ జనాభాలో సుమారు 64 శాతానికిపైగా సోషల్‌ మీడియాల్లో అత్యధికంగా తమ కాలం గడుపుతున్నట్టు తేలింది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఏడాది కంటే ఈ ఏడాది సోషల్‌ మీడియా వినియోగదారులు 3.7 శాతం మంది పెరిగినట్టు డిజిటల్‌ అడ్వయిజరీ సంస్థ కెపియోస్‌ అధ్యయనంలో వెల్లడైంది. సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్న వారిలో తూర్పు, మధ్య ఆఫ్రికా దేశాల్లో సోషల్‌ మీడియా యూజర్ల సంఖ్య తక్కువగా ఉంది. ప్రతీ 11 మందిలో ఒక్కరికే సోషల్‌ మీడియాలో ఖాతాలున్నట్టు అధ్యయనంలో వెల్లడయింది. కానీ భారత్‌లో మాత్రం ప్రతీ ముగ్గురిలో ఒకరు సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉన్నట్టు తేలింది. ప్రజలు ప్రతి రోజు సగటున 2 గంటల 26 నిమిషాలు సోషల్‌ మీడియాలో గడుపుతున్నారు. సోషల్‌ మీడియాలో ఉంటున్న వారిలో బ్రెజిల్‌ వాసులు అత్యధికంగా సగటున 3 గంటల 49 నిమిషాలు సోషల్‌ మీడియాలో గడుపుతున్నారు. జపాన్‌ వాసులు అత్యంత తక్కువగా గంటలోపు మాత్రమే సోషల్‌ మీడియాని వినియోగిస్తున్నారు. సోషల్‌ మీడియా యూజర్లకి దాదాపుగా ఏడు యాప్స్‌లో ఖాతాలుంటు న్నాయి. వీటిలో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విటర్‌ ప్రధానమైనవి కాగా.. మిగిలిన వాటిల్లో కూడా ప్రజలు తమ ఆసక్తిని చూపుతున్నారు.