Site icon NTV Telugu

Monsoon: జూన్‌లో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు: ఐఎండీ..

Telangana Rains

Telangana Rains

Monsoon: సాధారణం కన్నా ముందే రుతుపవనాలు దేశంలో విస్తరిస్తున్నాయి. సాధారంగా జూన్ మొదటి వారంలో వచ్చే నైరుతి, ఈ సారి తొందరగానే పలకరించింది. దీంతో కేరళతో పాటు పలు రాష్ట్రాలు కురుస్తున్నాయి. వాణిజ్య నగరం ముంబైని వానలు ముంచెత్తాయి. ఇదిలా ఉంటే, ఈ జూన్ నెలలో సాధారణం కన్నా అధిక వర్షపాతం అవుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. జూన్ నెలలో సగటు వర్షపాతం కన్నా 108 శాతం ఎక్కువగా ఉంటుందని అంచనా.

Read Also: Manchu Vishnu: నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?

ముందస్తు వర్షాలతో దేశంలో చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా సగటు ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఐఎండీ ప్రకారం.. మధ్య, దక్షిణ భారతదేశంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాత నమోదువుతుందని, దీర్ఘకాలిక సగటులో 106 శాతం కన్నా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీనికి విరుద్ధంగా ఈశాన్య భారతంలో ఈసారి సాధారణం కన్నా తక్కువ వర్షపాత నమోదు కావచ్చని ఐఎండీ అంచనా వేసింది.

Exit mobile version