NTV Telugu Site icon

Gyanvapi case: జ్ఞానవాపీ కేసులో ముస్లింల తరపు న్యాయవాది గుండెపోటుతో మృతి

Abhay Nath Yadav

Abhay Nath Yadav

Gyanvapi case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వారణాసీ జ్ఞాన‌వాపి మ‌సీదు కేసులో ముస్లింల తరపు న్యాయవాది అభయ్‌నాథ్ యాదవ్ గుండెపోటుతో మరణించారు. ఆదివారం రాత్రి గుండెపోటుకు గురి అయిన ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. జ్ఞాన‌వాపీ మ‌సీదు వివాదంపై కోర్టులో ఉన్న కేసులో అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరపున అభయ్‌నాథ్ వాదిస్తున్నారు.

Lumpi Skin Disease: గుజరాత్‌లోని 17 జిల్లాలకు లంపి చర్మ వ్యాధి.. 1,200 పశువులు మృతి

జ్ఞాన‌వాపి మ‌సీదు, శిృంగార్ గౌరీ వివాదం కేసులో అభయ్ నాథ్ యాదవ్ ఆగస్టు 4వతేదీన కోర్టులో ముస్లింల తరపున తన వాదన వినిపించాల్సి ఉండగా, ఆకస్మికంగా న్యాయవాది మరణించారు.జ్ఞాన‌వాపి మ‌సీదు కేసును లోయర్ కోర్టు విచారిస్తున్న నేపథ్యంలో దీనిపై అక్టోబరులో విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. సీనియర్ న్యాయవాది గుండెపోటుతో మరణించడంపై బనారస్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నిత్యానందరాయ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.