Site icon NTV Telugu

Delhi Elections: మోడీ సభలో ఖాళీ కుర్చీలంటూ ఆప్ ఎగతాళి.. వీడియో పోస్టు

Pmmodi

Pmmodi

ప్రధాని మోడీ సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయంటూ ఆప్ ఎగతాళి చేసింది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసింది. మోడీ సభలో ఖాళీ కుర్చీలంటూ ఆప్ రాసింది. దీనిని బట్టి ఢిల్లీలో కేజ్రీవాల్ మాత్రమే పోటీ చేస్తున్నారని తెలిపింది.

ఇది కూడా చదవండి: Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? జున్ను vs టోఫు రెండింట్లో బెస్ట్ ఏదో తెలుసా?

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన పార్టీలు నువ్వానేనా? అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒక బహిరంగ సభలో మాట్లాడారు. అయితే ఈ సభకు జనాలు రాలేదని ఆప్ ఆరోపించింది. సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయంటూ ఆప్ విమర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియో విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: Maharashtra: ఎంవీఏ సర్కార్‌లో ఫడ్నవిస్ అరెస్ట్‌కు ప్లాన్!.. దర్యాప్తునకు ఆదేశించిన మహాయుతి ప్రభుత్వం

ఢిల్లీ ఎన్నికల ప్రచారం దగ్గర పడింది. మూడు రోజుల్లో ప్రచారం ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి.

 

Exit mobile version