గోవా అసెంబ్లీ పోల్.. సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ దూకుడు పెంచింది ఆమ్‌ఆద్మీ పార్టీ.. ఇప్పటికే పంజాబ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఇక, ఇవాళ గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సీఎం అభ్యర్థిగా అమిత్ పాలేకర్ పేరును ప్రకటించారు.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లు ఉన్న గోవాలో ఏకంగా 39 స్థానాల నుంచి అభ్యర్థులను నిలబెట్టి.. ప్రతిష్టాత్మకంగా ప్రచారం నిర్వహించినప్పటికీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ… కానీ, ఈసారి మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది..
Read Also: శ్రీహరికోట ‘షార్’లో కోవిడ్ కల్లోలం.. ప్రయోగాలు ఆలస్యం..!
Also Read
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
అయితే, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్యే పోటీ ఉంటుందని తాజాగా వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం.. ఆప్ మరియు తృణమూల్ కాంగ్రెస్.. బీజేపీయేతర ఓట్లను మాత్రమే ప్రభావితం చేస్తాయని తెలిపారు.. గోవాలో పాలన మార్పును కోరుకునేవారు పదేళ్ల బీజేపీ దుష్టపాలన తర్వాత కాంగ్రెస్‌కు ఓటేస్తారని… పాలన కొనసాగాలని కోరుకునే వారు బీజేపీకి ఓటేస్తారని చిదంబరం వరుస ట్వీట్‌లలో పేర్కొన్నారు. అయితే, చిదంబరంపై ఎదురుదాడికి దిగారు కేజ్రీవాల్.. మరోవైపు గోవాలోని కోర్టాలిమ్ గ్రామంలో ఇటీవలే ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు ఆప్ చీప్.. గతసారి ఆప్‌కి స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కేజ్రీవాల్.. కోర్టాలిమ్‌లో ఓటర్లతో సంభాషిస్తూ కనిపించారు. కాగా, గోవాలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.
తాజావార్తలు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!