Site icon NTV Telugu

గోవా అసెంబ్లీ పోల్.. సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ దూకుడు పెంచింది ఆమ్‌ఆద్మీ పార్టీ.. ఇప్పటికే పంజాబ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్.. ఇక, ఇవాళ గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ సీఎం అభ్యర్థిగా అమిత్ పాలేకర్‌ పేరును ప్రకటించారు.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లు ఉన్న గోవాలో ఏకంగా 39 స్థానాల నుంచి అభ్యర్థులను నిలబెట్టి.. ప్రతిష్టాత్మకంగా ప్రచారం నిర్వహించినప్పటికీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది ఆమ్‌ ఆద్మీ పార్టీ… కానీ, ఈసారి మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది..

Read Also: శ్రీహరికోట ‘షార్‌’లో కోవిడ్‌ కల్లోలం.. ప్రయోగాలు ఆలస్యం..!

అయితే, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్యే పోటీ ఉంటుందని తాజాగా వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం.. ఆప్ మరియు తృణమూల్ కాంగ్రెస్.. బీజేపీయేతర ఓట్లను మాత్రమే ప్రభావితం చేస్తాయని తెలిపారు.. గోవాలో పాలన మార్పును కోరుకునేవారు పదేళ్ల బీజేపీ దుష్టపాలన తర్వాత కాంగ్రెస్‌కు ఓటేస్తారని… పాలన కొనసాగాలని కోరుకునే వారు బీజేపీకి ఓటేస్తారని చిదంబరం వరుస ట్వీట్‌లలో పేర్కొన్నారు. అయితే, చిదంబరంపై ఎదురుదాడికి దిగారు కేజ్రీవాల్.. మరోవైపు గోవాలోని కోర్టాలిమ్ గ్రామంలో ఇటీవలే ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు ఆప్‌ చీప్‌.. గతసారి ఆప్‌కి స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కేజ్రీవాల్.. కోర్టాలిమ్‌లో ఓటర్లతో సంభాషిస్తూ కనిపించారు. కాగా, గోవాలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.

Exit mobile version