Site icon NTV Telugu

Aam Aadmi Party: మధ్యప్రదేశ్‌లోనూ అడుగుపెట్టిన ఆప్.. మేయర్ పీఠం కైవసం

Aam Aadmi Party Enter Into Madhyapradesh

Aam Aadmi Party Enter Into Madhyapradesh

దేశ రాజకీయాల్లో సంచలనాత్మక మార్పులు తప్పేలా కనిపించడం లేదు. చీపురు పట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కో రాష్ట్రాన్ని ఊడ్చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఢిల్లీలోనే కాదు, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ విస్తరించాలన్న లక్ష్యంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్‌లోనూ అడుగుపెట్టింది. తాజాగా సింగ్రౌలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి రాణి అగర్వాల్ విజయం సాధించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం మధ్యప్రదేశ్ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ సాధించినట్లైంది. రాణి అగర్వాల్ బీజేపీ అభ్యర్థి చంద్ర ప్రతాప్ విశ్వకర్మపై 9,000 ఓట్లకు పైగా విజయం సాధించారు.”మా మేయర్ అభ్యర్థి రాణి అగర్వాల్‌లో సింగ్రౌలీలో గెలిపించారు. గెలిచిన కౌన్సిలర్‌లకు కూడా అభినందనలు. అరవింద్ కేజ్రీవాల్ పాలనా నమూనాను మధ్యప్రదేశ్ ముక్తకంఠంతో స్వాగతిస్తోంది” అని ఆప్ పేర్కొంది.

Gwalior Restaurant Fined:శాఖాహార కుటుంబానికి చికెన్ కర్రీ.. రెస్టారెంట్‌కు భారీ జరిమానా!

సింగ్రౌలీ మేయర్ ఎన్నికల్లో గెలుపొంది రాణి అగర్వాల్‌కు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. ఇప్పుడు దేశంలోని ప్రతి మూలలో ప్రజలు నిజాయితీ రాజకీయాలను ఇష్టపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కేజ్రీవాల్ కూడా సింగ్రౌలీని సందర్శించి అగర్వాల్ కోసం ప్రచారం చేశారు. అగర్వాల్‌తో కలిసి రోడ్ షో నిర్వహించారు. ముఖ్యంగా అగర్వాల్ సింగ్రౌలి స్థానం నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె మూడో స్థానంలో నిలిచారు. బార్గవాన్ గ్రామపంచాయతీ నుండి రాణి అగర్వాల్ సర్పంచ్‌గా ఉన్నారు. ఢిల్లీలో ప్రస్థానం మొదలుపెట్టిన ఆప్ పంజాబ్ లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version