NTV Telugu Site icon

Atishi: నాకు ఆ సీఎం సీటు వద్దు.. ఖాళీగానే ఉంచండి..!

Delhi Cm

Delhi Cm

Atishi: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి అతిషీ మర్లెనా ఈరోజు (సోమవారం) బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆయన కోసం పక్కన ఓ కుర్చీని ఉంచడంతో పాటు తాను వేరే సీట్లో కూర్చోని బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించిన విజువల్స్ ను ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది.

Read Also: Harish Rao: కాంగ్రెస్ సర్కార్‌కు కూల్చివేతలు తప్పా.. పూడ్చివేతలు రాదా?

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అతిషీ మర్లెనా మాట్లాడుతూ.. ఢిల్లీ సీఎం కుర్చీ ఎప్పటికీ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కోసమే ఉంటుందని తెలిపారు. రాముడు 14 ఏళ్లు వనవాసంలో ఉన్నప్పుడు భరతుడు రాజ్యం యొక్క బాధ్యతలు చేపట్టాల్సి వచ్చినప్పుడు ఎలాంటి బాధ కలిగిందో ఈరోజు నాకు కూడా అంతే బాధగా ఉంది అని పేర్కొన్నారు. ఎంతో కఠిన సమయంలో ఈ బాధ్యతలు స్వీకరిస్తున్నాను అని ఆమె చెప్పుకొచ్చారు. 14 ఏళ్ల పాటు భరతుడు కుర్చీపై చెప్పులు పెట్టుకుని పాలన ఎలా చేశాడో.. నేను కూడా అదే విధంగా రాబోయే నాలుగు నెలల పాటు ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తాను తెలిపింది. అరవింద్ కేజ్రీవాల్‌పై తప్పుడు కేసులు పెట్టి, అరెస్టు చేసి ఆరు నెలలు జైలులో ఉంచిన.. ఢిల్లీ ప్రజలు ఆయన నిజాయితీపై నమ్మకం ఉంచారని వెల్లడించింది. ఢిల్లీ సీఎం పీఠం అరవింద్ కేజ్రీవాల్‌కే చెందుతుంది.. ప్రజలు మళ్లీ ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని అతిషీ మర్లెనా వ్యాఖ్యనించింది.