జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అనూహ్య విజయం సాధించింది. ఎట్టకేలకు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు ఖాతా తెరిచింది. దోడా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మేహరాజ్ మాలిక్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ ప్రత్యర్థి గజయ్ సింగ్ రాణాపై ఆయన 4,770 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. దీంతో ఆప్ అధినేత కేజ్రీవాల్ ఫోన్ చేసి మాలిక్‌ను అభినందించారు. మాలిక్ గెలుపుతో పంజాబ్, గుజరాత్ తర్వాత మరో రాష్ట్రంలో ఆప్ ఖాతా తెరిచినట్టు అయింది.
దోడా నియోజవర్గంలో గెలుపొందిన ఆప్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మేహరాన్ మాలిక్‌కు ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. బీజేపీపై మీరు చేసిన పోరాటం, గెలిచిన తీరు అభినందనీయని అన్నారు. ఈ గెలుపుతో ఐదో రాష్ట్రంలో ఆప్ అడుగుపెట్టిందని, ఇందుకు పార్టీ నేతలు, కార్యకర్తలందరినీ అభినందిస్తున్నానని ట్వీట్ చేశారు. ఇక హర్యానాలో ఆప్‌ను నిరాశ పరిచింది. అక్కడ ఒక్క సీటు కూడా గెలవలేదు. త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్‌తో పాటు ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు కూడా ఆప్‌కు ఎంతో కీలకం కానున్నాయి.