Site icon NTV Telugu

Supreme Court: ఆధార్‌ను పౌరసత్వంగా అంగీకరించలేం..

Aadhar.

Aadhar.

Supreme Court: ఆధార్ కార్డుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ, ప్రైవట్ పరంగా వివిధ సేలలు పొందేందుకు ఆధార్ కార్డును ఓ గుర్తింపు కార్డుగా మాత్రమే ఉపయోగించ్చు కానీ.. భారత దేశ పౌరసత్వానికి ఇది ఖచ్చితమైన రుజువు కాదని తేల్చి చెప్పింది. బీహార్‌లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఎలక్టోరల్ రోల్స్ వివాదం నేపథ్యంలో ఈ తీర్పును అత్యున్నత న్యాయస్థానం వెలువరించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆధార్ కార్డు, ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు, రేషన్ కార్డులను పౌరసత్వ రుజువుగా పరిగణించలేమని ఈరోజు (ఆగస్టు 12) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది.

Read Also: AP Govt: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు జారీ..

అయితే, ఆధార్ యాక్ట్, 2016లోని సెక్షన్ 9 ప్రకారం.. ఇది కేవలం ఒక గుర్తింపు ధృవీకరణ కోసం మాత్రమేనని పౌరసత్వ రుజుకు కాదని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. ఇక, పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ వాదిస్తూ.. SIR ప్రక్రియలో ప్రొసీజరల్ అసమానతలుగా ఉన్నాయి.. ఇది పెద్ద సంఖ్యలో ఓటర్లను అనర్హులుగా మార్చే ఛాన్స్ ఉందన్నారు. 1950 తర్వాత భారత్ లో జన్మించిన వారందరూ దేశ పౌరులుగా గుర్తించాలని.. కానీ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో ఓటర్లను తొలగించడం చాలా అన్యాయమని కపిల్ సిబాల్ వాదించారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు సరిగ్గా వర్క్ చేయడం లేదు.. బ్రతికి ఉన్న వాళ్లను చనిపోయినట్లు జాబితా చేర్చడం వల్ల 65 లక్షల మంది ఓటర్ల పేర్లను ధృవీకరించకుండానే తొలగించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Read Also: కొత్త అందాలతో రెచ్చగొడుతున్న కింగ్డమ్ భామ భాగ్యశ్రీ …..

ఇక, ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ అడ్వొకేట్ రాకేష్ ద్వివేది వాదిస్తూ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఎలక్టోరల్ రోల్స్‌ను రివిజన్ చేయడం ద్వారా ఆధార్, పాన్, రేషన్ కార్డులు పౌరసత్వాన్ని నిరూపించే డాక్యుమెంట్లుగా చట్టబద్ధతమైనవి కాదని పేర్కొన్నారు. ఈ డాక్యుమెంట్లు గుర్తింపు కార్డులుగా వినియోగిస్తున్నప్పటికీ పౌరసత్వాన్ని నిర్ధారించవని ఈసీఐ చెప్పుకొచ్చింది. ఈ ప్రక్రియలో ఎలాంటి పౌరుడి పౌరసత్వాన్ని రద్దు చేయడం లేదు.. కేవలం ఓటింగ్ అర్హతను మాత్రమే నిర్ధారిస్తున్నామని ఎన్నికల కమిషన్ తరపు లాయర్ పేర్కొన్నారు. అయితే, ఆధార్ కార్డు పౌరసత్వ రుజువుగా చెల్లదని తేల్చడంతో ఈసీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ, ఈ ప్రక్రియ సమయం, విధానంపై ఆందోళనలను కూడా న్యాయస్థానం వ్యక్తం చేసింది.

Exit mobile version