Site icon NTV Telugu

వైరల్ వీడియో: మెట్రో స్టేషన్‌ పైనుండి దూకేయబోయిన అమ్మాయి

ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న యువతి కొంత కాలంగా మానసిక ఒత్తిడితో బాధ‌ప‌డుతోంది. ఈ కార‌ణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఢిల్లీలోని ఫరీదాబాద్‌ మెట్రో రైల్‌ స్టేషన్ పైకి ఎక్కింది ఆ యువ‌తి. సమాచారం అందుకున్న ఎస్సై ధన్‌ ప్రకాశ్‌, కానిస్టేబుల్ సర్ఫ్‌రాజ్ అక్క‌డ‌కు వెళ్లారు. మెట్రో సిబ్బందితో క‌లిసి ఆ యువ‌తికి న‌చ్చ చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. కాగా స్టేషన్‌ కింద ఉన్న ఎస్సై ఆమెను మాటల్లోకి దించి దృష్టి మరల్చాడు. ఇంతలోకి పైకి ఎక్కి ఆమె దగ్గరకు వెళ్లిన కానిస్టేబుల్‌ ఆ అమ్మాయిని ఒక్కసారిగా పట్టుకున్నాడు. ఆతర్వాత ఆమెను కిందకు తీసుకొచ్చి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version