Site icon NTV Telugu

UP Teacher Suspended: క్లాస్ రూమ్‌లో టీచర్ పాడు పని.. వీడియో వైరల్

School Teacher Alcohol

School Teacher Alcohol

A School Teacher Suspended Who Consumes Alcohol in Class Room In Hathras: అతడు ఒక ఉపాధ్యాయుడు. విద్యార్థులకు మంచి బుద్ధులు, జ్ఞానాన్ని నేర్పించడంతో పాటు వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దాల్సిన ఉన్నత పదవిలో ఉన్నాడు. మరి, అతడు తన విధులకు కట్టుబడి ఉన్నాడా? అంటే లేనే లేడు. అందుకు భిన్నంగా.. క్లాస్ రూమ్‌లోనే విద్యార్థుల ముందు పాడు పని చేస్తూ వస్తున్నాడు. చివరికి అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో.. అతడి ఉద్యోగం ఊడింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

హత్రాస్ డీఆర్‌బీ ఇంటర్ కాలేజీలో శైలేంద్ర సింగ్ గౌతమ్ అనే వ్యక్తి అసిస్టెంట్ టీచర్‌గా పని చేస్తున్నాడు. ఆ కాలేజీలో చేరినప్పటి నుంచే శైలేంద్ర తీరు వివాదాస్పదంగానే ఉంది. తోటి సిబ్బంది పట్ల సరిగ్గా ప్రవర్తించేవాడు కాదు. ఫలానా పని చేయొద్దని సలహా ఇచ్చినా చాలు.. అదేదో ఆస్తి కాజేసినట్టుగా రివర్స్‌లో ఎగబడేవాడు. అంతటితో ఆగకుండా.. తరగతి గదుల్లోకి బీర్లు తెచ్చుకుని తాగడం మొదలుపెట్టాడు. ఇది విద్యార్థులపై ప్రభావం చూపుతుందని, ఇది సరైన పద్ధతి కాదని మొత్తుకున్నా.. ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను మారేది లేదన్నట్టుగా వ్యవహరించాడు. దీంతో విసుగెత్తిపోయిన తోటి సిబ్బంది.. అతడ్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని పన్నాగం పన్నారు.

ఎప్పట్లాగే రీసెంట్‌గా కూడా శైలేంద్ర ఓ తరగతి గదిలోకి బీరు తీసుకెళ్లాడు. ఇంకేముంది.. వలలో చిక్కిందిరా చేప అనుకొని అతడు బీర్ తాగుతున్నప్పుడు తోటి సిబ్బంది వీడియో తీసింది. వీడియో తీయొద్దని శైలేంద్ర హెచ్చరిస్తున్నట్టు ఆ వీడియోలో గమనించవచ్చు. పక్కనే ఉన్న మహిళా టీచర్ కూడా ఏమీ అనకుండా ఊరికే కూర్చొని ఉండటం గమనార్హం. ఈ వీడియోని సోషల్ మీడియాలో పెట్టగా.. క్షణాల్లోనే వైరల్ అయ్యింది. యూపీ ప్రభుత్వం దృష్టికి చేరగా.. ఆ టీచర్‌ని వెంటనే సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించింది. ‘దేశంలో ప్రభుత్వ ఉద్యోగుల ఎలా ప్రవర్తిస్తున్నారో అనడగానికి ఈ వీడియోనే ప్రతక్ష సాక్ష్యమని నెటిజన్లు మండిపడుతున్నారు.

Exit mobile version