NTV Telugu Site icon

Justice Nv Ramana: జస్టిస్ ఎన్వీ రమణకు అరుదైన గౌరవం.. అదేంటంటే?

Cji Ramana

Cji Ramana

భారత రాష్ట్రపతిగా శ్రీమతి ద్రౌసది ముర్ము ప్రమాణ స్వీకారానికి మరికొద్దిగంటలే మిగిలి వుంది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పీఠం అధిరోహించిన తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించనున్నారు. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణం చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ సమక్షంలో.. ఆమె ప్రమాణస్వీకారం జరగనుంది. అనంతరం ముర్ము రాష్ట్రపతి హోదాలో ప్రసంగిస్తారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ.. ద్రౌపది ముర్ము చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉదయం 10.15 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం సైనికులు.. ముర్ముకు ’21 గన్ సెల్యూట్’ సమర్పిస్తారు. సైనిక వందనం స్వీకరిస్తారు.

Monkeypox: కామారెడ్డి జిల్లాలో మంకీపాక్స్ కలకలం!

భారత రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే వుంటుంది. అందునా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఎన్​వీ రమణ ఈ అరుదైన ఘనతను స్వంతం చేసుకోనున్నారు. రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించనున్న తొలి తెలుగు వ్యక్తిగా జస్టిస్‌ రమణ ఖ్యాతి గడించనున్నారు. సాధారణంగా రాష్ట్రపతితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రస్తుతం సీజేఐగా ఉన్న జస్టిస్‌ రమణ.. ఆ గౌరవం దక్కించుకుంటున్నారు. ఇప్పటివరకు ఏ తెలుగు వ్యక్తి భారత రాష్ట్రపతితో ప్రమాణం చేయించని చరిత్ర లేదు.

గిరిజన సంప్రదాయంలో ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు. సంప్రదాయ సంతాలీ చీరను ముర్ము కోసం ఆమె వదిన సుక్రీ టుడూ తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే ద్రౌపది ముర్ము ఈ చీర ధరిస్తారో లేదో తెలియదని, నేను సంతాలీ చీర తీసుకెళ్తున్నా. ప్రమాణస్వీకారానికి ఈ చీర ధరిస్తుందని ఆశిస్తున్నా. దుస్తులపై రాష్ట్రపతి భవన్ తుది నిర్ణయం తీసుకుంటుందని సుక్రీ తెలిపారు. ముర్ము సోదరుడు, వదిన, కూతురు- అల్లుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రానున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రమాణస్వీకార మహోత్సవంలో ఆదివాసీల సంప్రదాయంప్రమాణస్వీకారానికి ముందు ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, నూతనంగా ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటుకు ఊరేగింపుగా రానున్నారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా, మంత్రిమండలి సభ్యులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, దౌత్యవేత్తలు, కీలక సైనికాధికారులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. హోంమంత్రిత్వశాఖ ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసింది.

Allu Arjun: అబ్బ.. ఏమున్నాడు.. ‘పుష్ప’ రాజ్ న్యూ లుక్ అదుర్స్