NTV Telugu Site icon

Man Wakes Up From Dead: నోట్లో పాలు పోశారు.. శవం లేచి కూర్చుంది

Tamilnadu Dead Man Wakes Up

Tamilnadu Dead Man Wakes Up

A Man Declared Dead By Doctors Wakes Up In Tamilnadu: ఎక్కడైనా చనిపోయిన వాళ్లు.. ప్రాణాలతో తిరిగి వస్తారా? ఇలాంటివన్నీ సినిమాల్లో చూడటమే తప్ప.. నిజ జీవితంలో జరగదు. అది అసాధ్యం కూడా! కానీ.. తమిళనాడులో ఓ శవం మాత్రం లేచి కూర్చుకుంది. నోట్లో పాలు పోయగానే.. ఓ వ్యక్తి ప్రాణాలతో తిరిగొచ్చాడు. ఇదెలా సాధ్యం? అని అనుకుంటున్నారా! అసలు ఆ వ్యక్తి చనిపోనే లేదు. అతడు చనిపోయాడని కుటుంబసభ్యులు అనుకున్నారు. అంత్యక్రియల తంతు కూడా మొదలుపెట్టారు. తీరా పాలు పోయగానే.. అతడు ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

US Fighter Jet Crash: హెలికాప్టర్ మాదిరి ల్యాండింగ్.. అదుపు తప్పి కూలిన ఫైటర్ జెట్

తమిళనాడులోని పుదుకోట జిల్లా ఆలంపట్టి మురండాంపట్టి గ్రామానికి చెందిన షణ్ముగం (60) అనే రైతు గుండె, కాలేయ సమస్యలతో బాధపడుతున్నాడు. ఇటీవల అతడు అనారోగ్యానికి గురవ్వడంతో.. కుటుంబీకులు వెంటనే దగ్గరలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు అతనికి మెరుగైన చికిత్స అందించినప్పుడు.. ఆరోగ్యం క్షీణించింది. అతని శరీరం చికిత్సకు సహకరించలేదు. షణ్ముగం కూడా ఎలాంటి కదలికలు లేకుండా శవంలా ఉండిపోయాడు. దీంతో.. అతడు చనిపోయాడని వైద్యులు అనుకున్నారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి, అతని బాడీని అప్పగించారు.

Tragedy In Honeymoon: హనీమూన్‌లో విషాదం.. ఇంటికి తిరిగి వస్తుండగా..

గురువారం షణ్ముగం మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి.. ఇంటిబయట తిన్నెపై కూర్చోబెట్టారు. అంత్యక్రియల తంతుని ప్రారంభించారు. తమ సంప్రదాయం ప్రకారం.. షణ్ముగం కుమారుడు కడసారిగా తండ్రి భౌతికకాయం నోట్లో పాలు పోశాడు. అంతే.. షణ్ముగం ఒక్కసారిగా దగ్గుతూ, కళ్లు తెరిచాడు. ఆ దెబ్బకు చుట్టూ ఉన్న బంధువులు బెంబేలెత్తిపోయారు. చనిపోయిన వ్యక్తి ఎలా తిరిగొచ్చాడా? అంటూ ఖంగుతిన్నారు. మరోవైపు.. ‘ఏం జరిగింది?’ అంటూ షణ్ముగం లేచి నిల్చున్నాడు. ఈ ఘటన స్థానికింగా హాట్ టాపిక్‌గా మారింది.

Show comments