NTV Telugu Site icon

Saif Ali Khan Case: సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుడి వేలిముద్రలు మిస్ మ్యాచ్..

Saif Ali Khan Case

Saif Ali Khan Case

Saif Ali Khan Case: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు వేలిముద్రలు ఒక్కటి కూడా సరిపోవడం లేదు. దీంతో పోలీసులు తలలుపట్టుకుంటున్నారు. బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చోరికి ప్రయత్నించి, సైఫ్‌పై దాడి చేసి నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలు మిస్ మ్యాచ్ అవుతున్నాయి. ఫోరెన్సిక్ సేకరించిన 19 సెట్ల వేలిముద్రలు నిందితుడితో సరిపోలడం లేదు. దీంతో మరోసారి విచారణ మొదటికొచ్చింది.

Read Also: Anil Ravipudi : బుల్లిరాజు వ్యాఖ్యలపై ఎటువంటి విమర్శలు లేవు

ముంబై పోలీసులు మిస్టర్ ఖాన్ ఇంట్లో దొరికిన వేలిముద్రలను రాష్ట్ర క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) యొక్క వేలిముద్రల బ్యూరోకు పంపారని వర్గాలు తెలిపాయి. నివేదిక ప్రకారం, ఆ వేలిముద్రలు షరీఫుల్ వేలిముద్రలతో సరిపోలడం లేదని తేలింది. పరీక్ష ఫలితం ప్రతికూలంగా ఉందని CID ముంబై పోలీసులకు తెలియజేసిందని వర్గాలు తెలిపాయి. ముంబై పోలీసులు మరిన్ని పరీక్షల కోసం మరిన్ని నమూనాలను పంపారు.

జనవరి 15న బంగ్లాదేశీయుడైన షరీఫుల్ ఇస్లాం సైఫ్ ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. వెన్నెముకలో కత్తి విరిగింది. వెంటనే ఆయనను లీలావతి ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. దాడి తర్వాత నిందితుడు పారిపోయాడు. ఇతడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. దాడి జరిగిన 70 గంటల తర్వాత నిందితుడిని థానేలో అరెస్ట్ చేశారు.