NTV Telugu Site icon

కరోనా వ్యాక్సిన్ పై 97 ఏళ్ల బామ్మ ప్రచారం… వీడియో వైరల్ 

కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో దేశంలో వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.  మూడు వ్యాక్సిన్లు కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.  ఇక వ్యాక్సిన్ల పై అనేక మందికి అనేక అపోహలు ఉన్న సంగతి తెలిసిందే.  మొదట్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా జరిగింది.  సెకండ్ వేవ్ ఉధృతి పెరుగుతుండటంతో వ్యాక్సిన్ వేయించుకునేవారి సంఖ్య భారీగా పెరిగింది.  ఇక వ్యాక్సిన్ పై ఓ బామ్మ అవగాహన కల్పిస్తూ వీడియో చేసింది.  మార్చి నెలలో తాను వ్యాక్సిన్ తీసుకున్నానని, తనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాలేదని, నొప్పికూడా తెలియలేదని బామ్మ పేర్కొన్నది.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.