NTV Telugu Site icon

Diwali: ఆ రాష్ట్రంలోని 7 గ్రామాల్లో 22 ఏళ్లుగా నిశ్శబ్ధ దీపావళి.. కారణం ఇదే..

Diwali

Diwali

Diwali: దేశం అంతటా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు, నగరాలు పటాకుల సందడితో, తారాజువ్వల వెలుగులతో అందంగా మారాయి. అయితే తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని 7 గ్రామాలు మాత్రం నిశ్శబ్ద దీపావళిని జరుపుకుంటారు. కాంతి వెలుగులు లేకుండా, శబ్ధాలు రాకుండా ఈ గ్రామాల్లో దీపావళి జరుగుతుంది.

దీనికి ఓ కారణంగా ఉంది. ఈ 7 గ్రామాలకు సమీపంలోనే పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది. అందుకనే ఈ గ్రామాల్లోని ప్రజలు వాటికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దీపావళిని జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఈరోడ్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వడముగం వెల్లోడ్ బర్డ్ సాంక్చుయరీ ఉన్న చుట్టుపక్కన ఈ గ్రామాలు ఉన్నాయి. వేలాది స్థానిక పక్షి జాతులు, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చే పక్షలు అక్టోబర్ నుంచి జనవరి మధ్య ఈ అభయారణ్యంలో గుడ్లు పెట్టి వాటిని పొదుగుతాయి.

Read Also: Israel: ఫిన్లాండ్‌కి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని విక్రయించనున్న ఇజ్రాయిల్..

దీపావళి సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెల్లలో వస్తుంది. కాబట్టి పక్షుల అభయారణ్యం చుట్టుపక్కల నివసించే 900 కంటే ఎక్కువ కుటుంబాలు పక్షుల్ని రక్షించడానికి, టపాకాయలు, క్రాకర్లను పేల్చకుండా, పక్షుల్ని బయపెట్టకుండా ఉండటానికి నిర్ణయం తీసుకున్నారు. గత 22 ఏళ్లుగా ఈ గ్రామాల ప్రజలు ఇలాగే నిశ్శబ్దంగా దీపావళి జరుపుకుంటున్నారు. టపాకాయలు పేల్చకుండా చిన్న నిప్పురవ్వలు వచ్చే క్రాకర్స్ మాత్రమే గ్రామస్తులు అనుమతిస్తారు. ఈ ఏడాది కూడా ల్లప్పంపాళయం, వడముగం వెల్లోడే, సెమ్మందంపాళయం, కరుక్కనకట్టు వలస, పుంగంపాడి తదితర గ్రామాలు నిశ్శబ్ద దీపావళిని జరుపుకుంటున్నాయి.