Site icon NTV Telugu

Cloudburst: జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ క్లౌడ్‌బరస్ట్.. ఏడుగురు మృతి

Cloudburst

Cloudburst

జమ్మూకాశ్మీర్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. కథువాలో ఆకస్మిక వరదలు కారణంగా ఏడుగురు చనిపోయారు. జోధ్ ఘాటిలో వరదలు కారణంగా ఐదుగురు చనిపోతే.. జాంగ్లోట్‌లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మరణించారు. అనేక మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. నేటి గోల్డ్ రేట్స్ ఇలా..!

శనివారం-ఆదివారం మధ్య రాత్రి సమయంంలో ఈ క్లౌడ్ బరస్ట్ జరిగింది. ఒక్కసారిగా వరద ముంచుకొచ్చింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఒక రైల్వే ట్రాక్, జాతీయ రహదారి-44, ఒక పోలీస్ స్టేషన్ కూడా తాజా వరదల్లో దెబ్బతిన్నాయని చెప్పారు. వెంటనే సైన్యం, పారామిలిటరీ దళాలు వెంటనే రంగంలోకి దిగి చర్యలు చేపట్టాయి. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కథువా సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.

ఇది కూడా చదవండి: UP: మీరట్‌లో దారుణం.. జవాన్‌ను స్తంభానికి కట్టేసి చావబాదిన టోల్‌ సిబ్బంది

ఇక మృతుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. కథువా జిల్లాలో ప్రజలు సురక్షితంగా ఉండటానికి సహాయ, రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

కథువా జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలు నదులు, వాగులు, నహల్లాలు, ఇతర నీటి వనరుల దగ్గరకు వెళ్లకుండా ఉండాలని, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని.. ఇతర ప్రమాద ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ఇక ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి 63 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఆగస్టు 14న మచైల్ మాతా ఆలయానికి వార్షిక తీర్థయాత్ర కోసం చిసోటిలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడినప్పుడు ఈ విషాదం సంభవించింది. కనీసం 82 మంది ఇంకా ఆచూకీ తెలియలేదు. ఈ యాత్ర జూలై 25న ప్రారంభమై సెప్టెంబర్ 5న ముగియాల్సి ఉంది.

 

Exit mobile version