Site icon NTV Telugu

Road Accident: నాగ్‌పూర్-పూణే హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Accident

Accident

Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్‌పూర్-పూణె హైవేపై ఈరోజు ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాాదంలో ఏడుగురు మరణించగా.. 13 మంది గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదస్థలాన్ని బట్టి చూస్తే వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బుల్ధానా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు మెహ్‌కర్ నుంచి పూణే వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు వేరేవేరు దిశల్లో వస్తుండగా ట్రక్కు, బస్సు ఎదురెదుగా ఢీకొన్నాయి.

Read Also: Bengaluru: బెంగళూర్ వర్షంలో ఐదుగురిని కాపాడిన “మహిళ చీర”

ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ఈ ప్రమాదానికి ముందు మరో రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి 11 గంటలకు వేగంగా వెళ్తున్న ట్రక్కు, ఎస్‌యూవీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. అమరావతి సమీపంలో దరియాపూర్-అంజంగావ్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. బాధితులు దరియాపూర్ లో జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.

Exit mobile version