NTV Telugu Site icon

Goa: వాటర్‌ఫాల్స్‌ వద్ద చిక్కుకున్న పర్యాటకులు.. 50 మంది రెస్క్యూ, మరో 30 మంది కోసం..

Goa

Goa

Goa: గోవాలోని పాలి జలపాతం వద్ద 80 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చారు. భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతో వీరంతా చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ జలపాతం గోవాలోని సత్తారి తాలూకాలో ఉంది. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది సహాయంతో ప్రస్తుతం జలపాతం వద్ద రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని ఎస్పీ అక్షత్ కౌశల్ తెలిపారు.

Read Also: JP Nadda JK Visit: రెండోరోజూ జమ్మూకశ్మీర్ పర్యటనలో నడ్డా..జమ్మూ ఎయిమ్స్ సందర్శన

వర్షాలు కురుస్తుండటంతో జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ జలపాతాన్ని చేరుకోవాలంటే నదిని దాటాల్సి ఉంటుంది. భారీ వర్షాల వల్ల జలపాతం వద్ద నీటి ప్రవాహం పెరగడంతో 80 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వీరిలో 50 మందిని అధికారులు రక్షించారు. మిగిలిన 30 మందిని కాపాడేందుకు ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.