Site icon NTV Telugu

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడి.. టూరిస్టులపై కాల్పులు..

Jammu Kashmir

Jammu Kashmir

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పహెల్‌గావ్‌లో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 10 మంది గాయపడ్డారు. ఒకరు మరణించినట్లు సమాచారం. పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఉగ్రదాడి ఘటన జరిగిన ప్రాంతానికి భద్రతా బలగాలు చేరుకుని, కూంబింగ్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల కోసం వేట సాగిస్తున్నారు.

Read Also: Vivo T4 5G: మిడ్ రేంజ్లో భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదలైన వివో T4 5G

పహల్గామ్‌లోని బైసరన్ లోయలోని ఎగువ గడ్డి మైదానాల్లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి కాలినడక లేదా గుర్రాలపై మాత్రమే చేరుకోవచ్చు. ఉగ్రవాదులు టూరిస్టులను టార్గెట్ చేసుకుని పక్కా ప్లాన్ ప్రకారమే దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అడవులు, సరస్సులు, విశాలమైన గడ్డి మైదానాలకు పహల్గామ్ ప్రసిద్ధి. వేసవి కాలం కావడంతో జమ్మూ కాశ్మీర్‌కి వచ్చే టూరిస్టుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు వీరిని టార్గెట్ చేశారు.

https://youtu.be/5cO_YW5mGqE

Exit mobile version