Classical language: కేంద్ర కేబినెట్ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. మరో 5 భాషలకు ‘‘శాస్త్రీయ హోదా’’(క్లాసికల్ స్టేటస్)ని కల్పించారు. మరాఠీ, బెంగాలీ, పాళీ, ప్రాకృతం, అస్సామీ భాషలకు కొత్తగా క్లాసికల్ హోదాను కల్పించాలని గురువారం నిర్ణయించారు. ఈ హోదాతో కలిగిన భాషల సంఖ్య ప్రస్తుతం 6 నుంచి 11కి పెరిగింది. ఇంతకు ముందు తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు శాస్త్రీయ హోదా కల్పించారు. 2004లో తొలిసారిగా తమిళానికి, 2014లో ఒడియా భాషకు చివరిసారిగా క్లాసికల్ హోదా దక్కింది.
ప్రస్తుతం శాస్త్రీయ హోదా దక్కిన భాషలకు ఎప్పటి నుంచో ఈ హోదా కల్పించాలనే డిమాండ్ ఉంది. 2014లో అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మఠారీ భాషపై భాషా నిపుణులతో కమిటీని ఏర్పాటు చేశారు. మరాఠీని క్లాసికల్ లాంగ్వేజ్‌గా గుర్తించేందుకు అన్ని ప్రమాణాలు ఉన్నాయని చెబుతూ కమిటీ కేంద్రానికి రిపోర్టును కూడా పంపింది.
Read Also: Central Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. క్లాసికల్ లాంగ్వేజెస్ గా మరో ఐదు భాషలు
శాస్త్రీయ భాషగా గుర్తించబడాలంటే ఈ కింది ప్రమాణాలు ఉండాలి:
1) 1500-2000 ఏళ్ల కాలంలో భాషకి సంబంధించి ప్రారంభ గ్రంథాలు. చరిత్రని కలిగి ఉండాలి.
2) భాష తప్పనిసరిగా ప్రాచీన సాహిత్యం లేదా దాని మాట్లాడే వారిచే విలువైన వారసత్వంగా పరిగణించబడే గ్రంథాలను కలిగి ఉండాలి.
3) భాష యొక్క సాహిత్య సంప్రదాయం అసలైనదిగా ఉండాలి మరియు మరొక ప్రసంగ సంఘం నుండి ఉద్భవించకూడదు.
4) సాంప్రదాయ భాష మరియు దాని సాహిత్యం దాని ఆధునిక రూపానికి భిన్నంగా ఉండాలి, సాంప్రదాయ భాష మరియు దాని తరువాతి రూపాలు లేదా ఉత్పన్నాల మధ్య సంభావ్య విరమణ ఉండాలి.
భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో జాబితా చేయబడిన 22 భాషలు– అస్సామీ, బెంగాలీ, బోడో, డోగ్రీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మైథిలీ, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంస్కృతం, సంతాలి, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ. వీటిలో 11 భాషలకు శాస్త్రీయ హోదా దక్కింది.