5 Knives Used By Aaftab Poonawala To Chop Up Body Found: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసులో విచారణ వేగవంతంగా జరుగుతోంది. గురువారం నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు నార్కో టెస్టు నిర్వహించారు. మరోసారి నార్కో నిర్వహించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. శనివారంతో అఫ్తాబ్ పోలీస్ కస్టడీ ముగియనుంది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ గొంతుకోసి హత్య చేశారు. ఆ తరువాత మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి ఢిల్లీ సమీపంలోని ఛత్తార్ పూర్ అటవీ ప్రాంతంలో పారేశాడు. శ్రద్ధా తండ్రి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also: Asaduddin Owsisi: శ్రద్ధా వాకర్ హత్య “లవ్ జీహాద్” కాదు..
అయితే ఈ కేసులో అఫ్తాబ్ ఉపయోగించిన ఆయుధాలు కీలకంగా మారాయి. వీటి కోసం పోలీసులు ముందు నుంచి గాలింపు చేపట్టారు. అయితే అఫ్తాబ్, శ్రద్ధా బాడీని 5 కత్తులను ఉపయోగించి 35 ముక్కలుగా కట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5-6 అంగుళాల పొడవున్న ఐదు కత్తుల స్వాధీనం చేసుకున్నామని.. వాటిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపామని పోలీసులు తెలిపారు.
డెడ్ బాడీని ముక్కలుగా చేసి ఓ కొత్త ఫ్రిజ్ కొని వాటిలో దాచి, రాత్రి సమయాల్లో అటవీ ప్రాంతంలో పారేశాడు. ఈ కేసు వెలుగులోకి రావడంతో పోలీసులు, అఫ్తాబ్ చెప్పిన వివరాలతో శ్రద్ధాకు సంబంధించిన ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు అఫ్తాబ్ ప్లాట్ లో రక్తపు ఆనవాళ్లను సేకరించారు. వీటిని డీఎన్ఏ టెస్టు కోసం ఫోరెన్సిక్ ల్యాబుకు పంపారు. శ్రద్ధా తండ్రి డీఎన్ఏతో పోల్చి చూడనున్నారు. ఈ కేసులో డీఎన్ఏ ఫలితాలు వస్తే కేసు మరింతగా బలపడే అవకాశం ఉంది.