Site icon NTV Telugu

Haldwani jail: హల్ద్వానీ జైలులో హెచ్ఐవీ కలకలం.. మహిళతో సహా 44 మంది ఖైదీలకు పాజిటివ్..

Haldwani Jail

Haldwani Jail

Haldwani jail: హల్ద్వానీ జైలులో కలకలం రేగింది. ఏకంగా ఓ మహిళలో పాటు 40 మందికి పైగా ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ గా నిర్థారణ అయింది. మొత్తం 44 మంది ఖైదీలు ప్రస్తుతం ఆస్పత్రి పాలయ్యారు. ఈ వార్త జైలు అధికారుల్లో కలకలం రేపింది. నెలకు రెండు సార్లు ఆస్పత్రి నుంచి ఓ టీమ్ సాధారణ చెకప్ కోసం జైలుకు వెళ్తుంది. తేలిక పాటి సమస్యలు ఉన్న ఖైదీలందరికీ అక్కడే మందుల్ని అందచేస్తారు. తీవ్ర సమస్యలు ఉన్నవారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు.

Read Also: Triple Talaq: సైబర్ ఫ్రాడ్‌లో మోసపోయిన భార్య.. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..

ఇలా తనిఖీలు చేస్తున్న క్రమంలోనే ఖైదీలకు హెచ్ఐవీ నిర్థారణ అయినట్లు తెలుస్తోంది. హెచ్‌ఐవి సోకిన ఖైదీలకు సకాలంలో చికిత్స అందించడానికి జైలు పరిపాలన కూడా సాధారణ తనిఖీలను నిర్వహిస్తుంది. హెచ్‌ఐవీ రోగుల కోసం యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్‌టీ) కేంద్రాన్ని ఏర్పాటు చేశామని సుశీల తివారి ఆస్పత్రి డాక్టర్ పరమ్ జీత్ సింగ్ తెలిపారు. హెచ్ఐవీ సోకిన రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారులు ఎవరూ స్పందించలేదు.

ప్రస్తుతం హల్ద్వానీ జైలులో 1629 మంది మాజీ ఖైదీలు ఉన్నారు. ఇందులో 70 మంది మహిళా ఖైదీలు ఉన్నారు. జైల్లో హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఖైదీలలో మాదకద్రవ్య వ్యసనం కారణంగా అవుతున్నట్లు తెలుస్తోంది. ఒక నివేదిక ప్రకారం, ఫిబ్రవరి నెలలో 23 మంది ఖైదీలు హెచ్‌ఐవి పాజిటివ్‌గా గుర్తించారు. మార్చి నెలలో 17 మంది ఖైదీలు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా గుర్తించారు. మొత్తంగా 40కి మందికి పైగా ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ గా తేలింది.

Exit mobile version