NTV Telugu Site icon

క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం.. ఇప్ప‌టి వ‌ర‌కు 420 మంది వైద్యులు మృతి

doctors

doctors

క‌రోనా సెకండ్ వేవ్ సామాన్యుల ప్రాణాలే కాదు.. పెద్ద సంఖ్య‌లో వైద్యుల ప్రాణాలు కూడా తీస్తోంది… క‌నిపించ‌ని వైర‌స్‌తో ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, న‌ర్సులు పెద్ద‌ల సంఖ్య‌లో దాని బారిన‌ప‌డుతూనే ఉన్నారు.. క‌రోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయిన త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా 420 మంది వైద్యులు మరణించారని ప్ర‌క‌టించింది ఇండియన్ మెడికల్ అసోసియేష (ఐఎంఏ).. అందులో కేవ‌లం ఢిల్లీలోనే 100 మంది వైద్యులు మృతిచెందార‌ని.. ఫ‌స్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్‌లోనే వైద్యులు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్టు ఐఎంఏ వెల్ల‌డించింది… ఓ ద‌శ‌లో 4 ల‌క్ష‌ల‌కు పైగా రోజువారి కేసులు న‌మోదు కాగా.. ఇప్ప‌టి త‌గ్గుముఖం ప‌ట్టింది.. కానీ, మృతుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది.. ప్ర‌తీరోజు 4 వేల మందికి ప్రాణాలు క‌రోనాతో మృతిచెంద‌డం ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.