Gurugram: గురుగ్రామ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దౌల్తాబాద్ ఇండస్ట్రీయల్ ఏరియాలోని ఫైర్ బాల్ తయారీ కర్మాగారంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీలో 15 మంది వరకు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ప్రమాద కారణాలను దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో ఒక టీంని ఏర్పాటు చేశారు. ప్రమాద సమయంలో పెద్ద ఎత్తున శబ్ధాలు వినిపించాయని, ఇవి తెల్లవారుజాము దాకా కొనసాగాయని స్థానికులు చెప్పారు.
Read Also: Fraud: పోలీసు అధికారినంటూ ఓ వ్యాపారి కుమారుడి నుంచి రూ. 3 కోట్లు కాజేత
ఆటో ఫైర్ ఆఫ్ (AFO) బాల్స్‌ను తయారు చేసే టెక్నోక్రాట్ ప్రొడక్టివ్ సొల్యూషన్‌కు చెందిన ఫ్యాక్టరీలో తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ బంతులను మంటలను ఆర్పే సాధనాలుగా ఉపయోగిస్తారు. పొటాషియం కంటైనర్లలో పేలుడు సంభవించిన తర్వాత మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పొటాషియంని ఫైర్ బాల్స్ తయారు చేసేందుకు వాడుతారు. ప్రమాదంలో ముందుగా ఇద్దరు చనిపోయారని భావించినప్పటికీ, సెర్చ్ ఆపరేషన్ తర్వత మరో ఇద్దరి మృతదేహాలు లభించాయి. మరో నలుగురు ఉద్యోగులు ఆస్పత్రిలో చేరగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమచారం. మరణించిన వ్యక్తుల్ని కౌశిక్, అరుణ్, ప్రశాంత్, రామ్ అవధ్‌గా గుర్తించారు.