Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..

  • ప్రీపెయిడ్ యూజర్ల రీచార్జ్‌లపై కొత్త మార్పులు.
  • ఇకపై 30 రోజుల వ్యాలిడిటీ ఉన్న రీచార్జ్ ఆప్షన్లు.
  • డేటా అవసరం లేని వారికి ప్రత్యేక ప్లాన్లు.
  • మార్పుల్ని స్వాగతించిన ఎంపీ రాఘవ్ చద్దా.
Raghav Chadha

Raghav Chadha

Mobile Recharge:  మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్. ఇన్నాళ్లు 28-రోజులకే ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జ్ ప్లాన్స్ ఉండేవి. అయితే, ఇప్పుడు చాలా మంది ప్రజలకు ఉపయోగపడేలా టెలికాం రీచార్జ్ ఆప్షన్లలో మార్పులు వచ్చాయని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం.. 30 రోజుల వ్యాలిడిటీ ఉన్న రీచార్జ్ ప్లాన్‌లతో పాటు డేటా అవసరం లేని వారికి ప్రత్యేకంగా వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ ఓన్లీ ప్లాన్స్ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. దీనిని ఆయన “తక్కువ బడ్జెట్ వినియోగదారుల” విజయంగా అభివర్ణించారు.

TRAI సెప్టెంబర్ 22, 2026న టెలికామ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్(13వ సవరణ) రెగ్యులేషన్స్ 2026ను విడుదల చేసింది. దీని ప్రకారం టెలికాం కంపెనీలు వాయిస్, ఎస్ఎంఎస్ ఓన్లీ స్పెషల్ టారిఫ్ ఓచర్స్(STVs)లను అందించాల్సి ఉంది. వాయిస్, ఎస్ఎంఎస్, డేటా కలిపిన రీచార్జులు ప్రతీ 30 రోజులు లేదా అంతకన్నా తక్కువ వాలిడిటీ పిరియడ్‌కు అనుగుణంగా ప్లాన్స్‌ను టెలికాం సంస్థలు అందించాల్సి ఉంటుంది. డేటా అవసరం లేని వారికి వాయిస్ మరియు ఎస్ఎంఎస్ రీచార్జ్ ప్లాన్‌లను కూడా అందించాలి.

ప్రీపెయిడ్ యూజర్లు చాలా కాలంగా ఎదుర్కొంటున్న 28-రోజుల రీచార్జులకు చెక్ పడినట్లే తెలుస్తోంది. దీనిపై రాఘవ్ చద్దా గతంలో పార్లమెంట్‌తో తన వాదన వినిపించారు. 28 రోజుల వ్యాలిడిటీని ‘మంత్లీ ప్లాన్’గా పరిగణించడం వల్ల ఏడాదికి 13 సార్లు రీచార్జ్ చేయాల్సి వస్తోందని చెప్పారు. తాజా నిబంధన వల్ల 30 రోజుల రీచార్జ్ ప్లాన్స్‌తో ఇకపై ఏడాదికి 13 సార్లు చేయాల్సిన రీచార్జులు 12కు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. కొత్త మార్పుల్ని రాఘవ్ చద్దా స్వాగతించారు. ముఖ్యంగా తక్కువ బడ్జెట్ ఫోన్లు కలిగిన వారు కేవలం కాల్స్ కోసమే ఉపయోగించే వారికి కాల్స్, ఎస్ఎంఎస్ రీచార్జ్ ప్లాన్స్ లభిస్తాయని చెప్పారు.