Terrorist Attack: జమ్మూ కాశ్మీర్‌లో టెర్రరిస్టులు బరితెగించారు. ఆదివారం రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బస్సు శివఖోడా ఆలయం నుంచి కత్రాకు తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.దాడి జరిగిన వెంటనే పోలీసులు, సైన్యం, పారామిలటరీ బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో బస్సు ఒక్కసారిగా లోయలో పడిపోయింది. అందులో ప్రమాణిస్తున్న ప్రయాణికుల్లో 10 మంది మరణించగా, 33 మంది గాయపడ్డారు.
Read Also: PM’s Oath Event: ప్రధాని మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో తళుక్కుమన్న తారలు, పారిశ్రామికవేత్తలు
కాల్పుల కారణంగా డ్రైవర్ బస్సుపై కంట్రోల్ కోల్పోవడంతో బస్సు లోయలో పడిందని రియాసీ ఎస్పీ మోహిత శర్మ తెలిపారు. పొరుగున ఉన్న పూంచ్, రాజౌరిలతో పోలిస్తే రియాసీ జిల్లాలో ఉగ్రవాదుల కార్యకలాపాలు చాలా తక్కువ, అయినప్పటికీ ఈ దాడి జరిగింది. ప్రయాణికుల గుర్తింపు ఇంకా ధ్రువీకరించలేదు. మరణించిన వారు స్థానికులు కాదని తెలుస్తోంది. భద్రతా బలగాలు ఘటన స్థలంలో దర్యాప్తు ప్రారంభించాయి.
ఈ ఘటనపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఈ దాడిని ఆయన ఖండించారు. ఉద్దేశపూర్వకంగా మన జాతీయ భద్రతకు భంగం కలిగిస్తున్నారని అన్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై బీజేపీ ప్రభుత్వానిది అసత్యప్రచారమే అని, ప్రస్తుతం మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బోలుగా ఉందని విమర్శించారు.