Site icon NTV Telugu

Breaking: మావోయిస్టుల మెరుపు దాడి.. ముగ్గురు జవాన్లు మృతి

Maoist

Maoist

మావోయిస్టులు మెరుపు దాడులకు దిగారు.. వారి కాల్పులు ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.. ఈ ఘటన ఒడిశాలోని నువాపాడా జిల్లా రుకేలాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జవాన్లు గస్తీ విధులు నిర్వహిస్తుండగా రుకేలా వద్ద మావోయిస్టులు మెరుపు దాడులకు తెగబడ్డారు… రోడ్ పార్టీపై దాడి చేయడంతో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు.. అప్రమత్తమైన పోలీసులు తిరిగి కాల్పులు జరిపారు.. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు అదనపు బలగాలను ఘటనా స్థలానికి పంపినట్టుగా తెలుస్తోంది.. మావోయిస్టుల దాడిలో శిశుపాల్ సింగ్, శివలాల్, ధర్మేంద్ర సింగ్​అనే జవాన్లు మృతిచెందినట్టుగా అధికారులు చెబుతున్నారు.. అందులో శిశుపాల్ సింగ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్​ కాగా, శివలాల్​, ధర్మేంద్రసింగ్.. హర్యాణాకు చెందినవారిగా తెలుస్తోంది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read Also: Viral: రూ.10 నాణేలతో ఏకంగా కారే కొనేశారు.. ఎందుకో తెలుసా..?

Exit mobile version