NTV Telugu Site icon

Blood transfusion: O-పాజిటివ్ బదులుగా వ్యక్తికి AB-పాజిటివ్ రక్తాన్ని ఎక్కించారు..

Rajasthan

Rajasthan

Blood transfusion: రక్తమార్పిడి విషయంలో వైద్య సిబ్బంది చాలా సీరియస్‌గా ఉండాలి. ఒక గ్రూపుకు బదులుగా వేరే గ్రూప్ రక్తం ఎక్కిస్తే రోగి మరణించడం ఖాయం. అయితే, రాజస్థాన్‌లో ఓ వ్యక్తి ఇలాగే మరణించాడు. రాష్ట్రంలోని సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన 23 ఏళ్ల యువకుడికి తప్పుడు రక్తం ఎక్కించారు. చివరకు రోగి మరణించాడు.
Read Also: Shanmukh Brother: మరో 6 రోజుల్లో పెళ్లి పెట్టుకుని మరో అమ్మాయితో అలా.. షణ్ముఖ్ అన్న నిజస్వరూపం ఇదే అంటున్న గీతూ!
జైపూర్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సవాయ్ మాన్ సింగ్ (SMS) ఆసుపత్రిలో వ్యక్తికి O-పాజిటివ్ బదులుగా AB-పాజిటివ్ రక్తాన్ని ఎక్కించారు. దీంతో అతను మరణించాడు. రాష్ట్రంలోని బండికుయ్ పట్టణానికి చెందిన బాధితుడు సచిన్ శర్మ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రిలోని ట్రామా సెంటర్‌లో చేర్చారు. చికిత్స సమయంలో ట్రామా సెంటర్‌లో ఒక వార్డ్ బాయ్ అవసరమైన రోగి బ్లడ్ గ్రూప్ o పాజిటివ్ అయితే, అతనికి AB పాజిటివ్ బ్లడ్ ఎక్కించామని ఆరోపించారు.
రక్త మార్పిడి తర్వాత రోగి రెండు మూత్రపిండాలు పనిచేయడంలో ఇబ్బందులు ఎదుర్కోవడవంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీసింది. దీంతో అతను మరణించినట్లుగా ఎస్ఎంఎస్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అచల్ శర్మ తెలిపారు. దీనిపై విచారణ కమిటీ ఏర్పాటు చేశామని, నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.