కరోనా మహమ్మారి సమయంలో లక్షలాది మంది వలసకూలీలు నగరాలు, పట్టణాల నుంచి సొంత గ్రామాలకు తరలివెళ్లిపోయారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో లాక్‌డౌన్ విధించడంతో అన్ని రంగాలు ఒక్కసారిగా మూతపడ్డాయి. 2020 మార్చి నుంచి జూన్ 2020 వరకు సుమారు 23 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు కేంద్ర కార్మికశాఖ స్పష్టం చేసింది. ఉద్యోగాలతో పాటు లక్షలాది మంది ఉపాధి అవకాశాలు కూడా కోల్పోయారు. మ్యానుఫాక్చరింగ్, కన్‌స్ట్రక్టింగ్, హెల్త్, ఎడ్యుకేషన్, ట్రేడ్, ట్రాన్స్‌పోర్ట్, హాస్పిటాలిటీ, బీపీవో వంటి రంగాల్లోని ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
Read: Ukraine Issue: ఉక్రెయిన్ పరిస్థితులపై అమెరికా కీలక వ్యాఖ్యలు… వెనక్కి వచ్చేయండి…
అంతేకాదు, ఫ్యాక్టరీల్లో పనిచేసే చిన్నచిన్న ఉద్యోగులు, కార్మికులు ఉపాధి కోల్పోవడంతో ఆదాయం లేక, నగరాల్లో ఉండలేక సొంత గ్రామాలకు తరలివెళ్లారు. కరోనా కారణంగా రవాణా సౌకర్యాలు సైతం లేకపోవడంతో వందల కిలోమీటర్ల మేర కాలినడకన నడిచివెళ్లిన దృశ్యాలు సోషల్ మీడిమాలో సంచలనం సృష్టించాయి. కేంద్ర కార్మికశాఖ లెక్కల ప్రకారం 2020 మార్చి నుంచి జూన్ 2020 వరకు 23 లక్షల మంది ఉద్యోగాలు కొల్పోయారని, ఇందులో 16 లక్షల మంది పురుషులు, 7 లక్షల మంది మహిళలు ఉన్నట్టు పార్లమెంట్‌లో తెలియజేసింది.
