NTV Telugu Site icon

బెంగాల్‌లో పిడుగుల వాన‌..! 20 మంది మృతి

lightning strikes

ప‌శ్చిమ బెంగాల్‌లో భారీ వ‌ర్షం కురిసింది.. ఉరుములు, మెరుపుల‌తో పిడుగులే కురుస్తున్నాయా? అనే త‌ర‌హాలో ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేశాయి.. అంతే కాదు.. ఈ పిడుగు పాటుకు ఒకే రోజు ఏకంగా 20 మంది మృతిచెంద‌గా.. మ‌రికొంత‌మంది గాయాల‌పాల‌య్యారు.. దక్షిణ బెంగాల్‌లోని కోల్‌కతాతో పాటు పలు జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపుల‌తో ఇవాళ సాయంత్రం వ‌ర్షం కురిసింది.. పిడుగుపాటుకు ముర్షిదాబాద్‌లో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. హుగ్లీలో మ‌రో 9 మంది మృతిచెందారు.. ఇక‌, మిడ్నాపూర్ జిల్లాలో మ‌రో ఇద్ద‌రు కూడా పిడుగుపాటుకు బ‌ల‌య్యారు.. ఇలా ఒకేరోజు 20 మంది మృతిచెందారు.. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో పాటు, సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ సంతాపం తెలిపారు.. ఇక‌, మృతిచెందిన‌వారికి రూ.2 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కార్యాల‌యం.. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన‌వారికి రూ.50 వేల చొప్పున చెల్లించ‌నున్న‌ట్టు పేర్కొంది పీఎంవో.