NTV Telugu Site icon

Union Minister Video Call: వీడియో కాల్‌లో పోర్న్.. కేంద్రమంత్రికే బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్

Union Minister Video Call

Union Minister Video Call

2 Men Arrested For Trying To Blackmail Union Minister By Playing Nude On Video Call: సాంకేతికతక పెరిగినప్పటి నుంచి సైబర్ నేరాలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఏవేవో లింక్‌లు పంపి మొబైల్ ఫోన్‌లను హ్యాక్ చేయడమో, వీడియో కాల్స్ ద్వారా బుట్టలో పడేసి న్యూడ్ వీడియో కాల్స్ రికార్డ్ చేయడం లాంటివి.. కొందరు దుండగులు పాల్పడుతున్నారు. ఈమధ్య కాలంలో అయితే.. న్యూడ్ వీడియో కాల్ వ్యవహారాలు మరీ పెచ్చుమీరిపోయాయి. తొలుత అమ్మాయిలుగా పరిచయం చేసుకోవడం.. పోర్న్ వీడియోల ద్వారా అవతలి వ్యక్తుల్ని టెంప్ట్ చేసి, దాన్ని రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్‌కి పాల్పడటం వంటివి చేస్తున్నారు. అదే పంథాలోనే.. ఇద్దరు కేటుగాళ్లు ఏకంగా కేంద్రమంత్రినే బ్లాక్‌మెయిల్ చేసేందుకు ప్రయత్నించారు. వీడియో కాల్‌లో పోర్న్ వీడియో ప్లే చేసి, ఆయన్ను బెదిరించాలని ట్రై చేశారు. కానీ.. వారి ప్లాన్ బెడిసికొట్టి, అడ్డంగా దొరికిపోయారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Manipur Violence: మణిపూర్‌లో ఆగని హింస.. మయన్మార్ సరిహద్దులోని మోరేలో 30 ఇళ్లకు నిప్పు

ఈ ఏడాది జూన్ నెలలో ఆ కేంద్రమంత్రికి వాట్సాప్‌లో ఓ కొత్త నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. బహుశా తెలిసిన వారు ఎవరైనా కొత్త నంబర్ నుంచి చేసి ఉంటారని భావించి, కేంద్రమంత్రి ఆ వీడియో కాల్‌ని లిఫ్ట్ చేశారు. ఆయన ఆ కాల్ లిఫ్ట్ చేయడమే ఆలస్యం, వెంటనే పోర్న్ వీడియో ప్లే అవ్వడం మొదలైంది. అసలేం జరుగుతుందోనని కేంద్రమంత్రికి అర్థమయ్యేలోపే, ఆ వీడియో కాల్ కట్ అయ్యింది. కొన్ని నిమిషాల తర్వాత కేంద్రమంత్రికి మరో నంబర్ కాల్ వచ్చింది. తమ డిమాండ్స్ పూర్తి చేయకపోతే, ఆ వీడియో క్లిప్‌ని వెంటనే సోషల్ మీడియాలో విడుదల చేస్తానని ఓ వ్యక్తి ఆ కాల్‌లో బెదిరించాడు. దీంతో ఖంగుతిన్న ఆ కేంద్రమంత్రి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు రంగంలోకి దిగి, కేంద్రమంత్రికి ఫోన్ కాల్ వచ్చిన నంబర్ ఆధారంగా విచారణ చేయడం మొదలుపెట్టారు. ఎట్టకేలకు జులై నెలలో మహ్మద్ వకీల్, మహ్మద్ సాహిబ్ అనే ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుని విచారిస్తున్న క్రైమ్ బ్రాంచ్ విభాగం.. ఇందులో ప్రమేయం ఉన్న మరికొందరిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Srinivasa Setu Flyover: శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ నిర్మాణంలో ప్రమాదం.. ఇద్దరు మృతి

Show comments