NTV Telugu Site icon

Cooker blast: బెంగళూర్‌లో కుక్కర్ పేలుడు.. ఉగ్రవాద కోణంలో దర్యాప్తు..

Cooker Blast

Cooker Blast

Cooker blast:బెంగళూర్ నగరంలో కుక్కర్ పేలుడు ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటనలో ఉగ్ర కోణం లేదని స్థానిక పోలీసులు తోసిపుచ్చగా, మరోసారి విచారించేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) సంఘటన స్థలానికి చేరుకుంది.

Read Also: Abhishek Manu Singhvi : తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్‌ మను సింఘ్వీ

బెంగళూర్ జేపీ నగర్‌లోని ఉడిపి ఉపహార స్నాక్స్ బ్రాంచ్ వద్ద సోమవారం ఉదయం 10 గంటలకు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సమీర్, మొహిసిన్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. వీరిద్దరు ఉత్తర్ ప్రదేశ్‌కి చెందినవారిగా తేలింది. పేలుడు తీవ్రతకు ఇంట్లో వస్తువలు చెల్లాచెదురుగా పడ్డాయి.

‘‘ఘటనా ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశామని, పేలుడు పదార్థాలు వినియోగించినట్లు ఎలాంటి ఆధారాలు లేవు, ఇది ప్రెషర్ కుక్కర్ పేలుడు. గాయపడిన ఇద్దరూ కూడా బార్బర్ వృత్తిలో ఉఎననారు. మేం ఉదయం దర్యాప్తు సామాగ్రిని పరిశీలించాము. అల్లర్లు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. మరింత దర్యాప్తు కోసం ఎన్ఐఏ అధికారులు పరిశీలిస్తున్నారు’’ అని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కనీసం 10 మంది గాయపడ్డారు.