Site icon NTV Telugu

కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. ఇద్దరు పైలట్లు మృతి..

జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకున్న ఓ దుర్ఘటనలో ఇద్దరు జవాన్లు కన్నుమూశారు.. ఉధంపూర్ జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పట్నిటాప్ వద్ద కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.. ఈ సమయంలో హెలికాప్టర్ లో ఉన్న ఇద్దరు పైలట్లు తీవ్రగాయాలపాలయ్యారు.. అయితే, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయజనం లేకుండా పోయింది.. అప్పటికే ఆ ఇద్దరు పైలట్లు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పైలట్లు మేజర్ ర్యాంకువారు. ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. తుక్కుతుక్కయిపోయిన హెలికాప్టర్ నుంచి గాయపడ్డ పైలట్లను స్థానికులు బయటకు తీసి.. మేజర్ రోహిత్ కుమార్, మేజర్ అనూజ్ రాజ్‌పుత్‌ను ఆస్పత్రికి తరలించారు.. మేం వారిని ఆసుపత్రికి తరలించాం.. కానీ దురదృష్టవశాత్తు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారని ఓ సీనియర్‌ ఆర్మీ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.. మేజర్ రోహిత్ కుమార్ మరియు మేజర్ అనూజ్ రాజ్‌పుత్ “21 సెప్టెంబర్ 2021 న పట్నిటాప్‌లో విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేశారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు ఇండియన్‌ ఆర్మీ.

Exit mobile version