NTV Telugu Site icon

Agniveers: ఫైరింగ్ ప్రాక్టీస్‌లో విషాదం.. ఇద్దరు అగ్నివీరులు మృతి..

Agniveers

Agniveers

Agniveers: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో విషాదం నెలకొంది. ఆర్టిలరీ సెంటర్ ఫైరింగ్ ప్రాక్టీస్ సందర్భంగా ఇద్దరు అగ్నివీరులు మరణించారు. ఇండియన్ ఫీల్డ్ గన్ నుంచి షెల్ మిస్ ఫైర్ కావడంతో ఇద్దరు మరణించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గురువారం మధ్యామ్నం నాసిక్ రోడ్ ప్రాంతంలోని ఆర్టిలరీ సెంటర్‌లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

Read Also: Dog Singing Video: ఇంగ్లీష్‌ పాట పాడే కుక్కని చూశారా? ఇక్కడ చూడండి..

ఈ పేలుడులో అగ్నివీరులు గోహిల్ విశ్వరాజ్ సింగ్(20), సైఫత్ షిత్(21) మరణించారు. అగ్నివీర్‌ల బృందం ఇండియన్ ఫీల్డ్ గన్‌తో కాల్పులు జరుపుతుండగా ఒక షెల్ పేలింది. ఈ పేలుడుతో ఇద్దరి తీవ్రగాయాలయ్యాయి. వీరిని డియోలాలిలోని ఎంహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ వారిద్దరు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. హవల్దార్ అజిత్ కుమార్ ఫిర్యాదు మేరకు డియోలాలీ క్యాంపు పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show comments