Coimbatore Blasts: 19 పేలుళ్లు, 58 మంది మృతి.. కోయంబత్తూర్ పేలుళ్ల నిందితులకు విజయ్ సర్కార్ పెరోల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Coimbatore Blasts: 1998 కోయంబత్తూర్ పేలుళ్ల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఐదుగురికి 60 రోజుల పాటు పెరోల్ మంజూరు చేస్తూ తమిళనాడులోని విజయ్ సర్కార్ నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది. టీవీకే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ లక్ష్యంగా ఈ పేలుళ్లు జరిగాయి. రాజకీయ లబ్ధి కోసం, శిక్షపడిన ఉగ్రవాదుల పట్ల విజయ్ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కజగం) ప్రభుత్వం పక్షపాత వైఖరిని అవలంబిస్తోందని బీజేపీ ఆరోపించింది. వారు చాలా కాలంగా జైలులో గడిపినందుకు, ఇతర నిందితులకు ఇచ్చినట్లే వీరికి కూడా పెరోల్ ఇవ్వడం సాధారణ ప్రక్రియలో భాగమే అని ప్రభుత్వం వాదిస్తోంది.
టీవీకే ఎమ్మెల్యే వీఎంఎస్ ముస్తఫా పెరోల్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. జైలు నుంచి విడుదల అవుతున్న వారిలో ఉన్న 46 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు గల ఐదుగురు దోషులు – మహమ్మద్ అన్సారీ, మహమ్మద్ అలీ, మోనప్ప అలియాస్ మహమ్మద్ హసన్, మహమ్మద్ అజమ్, నవాబ్ ఖాన్ ఉన్నారు. వ్యక్తిగత పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితుల్ని పేర్కొంటూ వీరు పెరోల్ కోసం అప్లై చేశారు.
Also Read
19 పేలుళ్లు, 58 మంది మృతి..
1998 ఫిబ్రవరి 14న అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ కోయంబత్తూర్లోని ఆర్ఎస్ పురం ఎన్నికల సభలో పాల్గొనేందుకు రావాల్సి ఉంది. ఆయన సభకు ముందు నగరంలో మధ్యాహ్నం 4 గంటల సమయంలో వరస బాంబు పేలుళ్లు సంభవించాయి. కోయంబత్తూరు మెడికల్ కాలేజ్ ఆసుపత్రి, రైల్వే స్టేషన్ సహా నగరంలోని పలు ప్రాంతాలు లక్ష్యంగా మారాయి. పూంపుహార్ టౌన్ హాల్, ఉక్కడం చేపల మార్కెట్, కరుణానిధి నగర్ వంటి ప్రాంతాల్లోనూ పేలుళ్లు జరిగాయి. ఫిబ్రవరి 15, 16 తేదీల్లో కూడా పేలుళ్లు కొనసాగాయి.
19 బాంబు పేలుళ్లలో 58 మంది ప్రాణాలు కోల్పోగా, 250 మంది గాయపడ్డారు. సుమారు రూ. 4.37 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. దర్యాప్తులో అల్ ఉమ్మా అనే సంస్థ దాడులకు పాల్పడినట్లు తేలింది. ఈ సంస్థను ఎస్ఏ బాషా ఏర్పాటు చేశారు. 2024లో ఆయన మరణించాడు. ఈ కేసులో 168 మందిని అరెస్ట్ చేయగా, 158 మందికి శిక్ష పడింది. సుమారు 40 మందికి జీవిత ఖైదు విధించారు. ప్రధాన నిందితుడు బాషాకు కూడా యావజ్జీవ శిక్ష పడింది.
తాజావార్తలు
-
Coimbatore Blasts: 19 పేలుళ్లు, 58 మంది మృతి.. కోయంబత్తూర్ పేలుళ్ల నిందితులకు విజయ్ సర్కార్ పెరోల్.
-
CJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్లకు బిగ్ రిలీఫ్..!
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
TTD Alert: తిరుమల భక్తులకు అలర్ట్.. అంతవరకు సిఫార్సు లేఖల దర్శనం బంద్..!
-
The Traitors Telugu :’చీప్.. మిడిల్ క్లాస్’.. వర్ష’పై శ్రీదేవి చౌదరి సంచలన వ్యాఖ్యలు.. ‘ట్రెయిటర్స్’లో ముదురుతున్న వివాదం!
ట్రెండింగ్
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!