Love Affair: ఓ జంట ప్రేమ వ్యవహారం విషాదంగా మారింది. పెళ్లికి ఒక రోజు ముందు 18 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. కేరళలోని మలప్పురం జిల్లా ఈ ఘటన జరిగింది. షైమా సినివర్ అనే యువతి తన పొరుగింటిలో ఉండే 19 ఏళ్ల సజీర్‌తో ప్రేమలో ఉంది. అయితే, ఆమె కుటుంబం మాత్రం వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. వివాహానికి వారం ముందే ఎంగేజ్మెంట్ జరిగింది. దీంతో మనస్తాపానానికి గురైన యువతి తన మామ ఇంటిలో ఉరేసుకుని మరణించింది. యువతి తండ్రి చనిపోయిన తర్వాత నుంచి మామ ఇంట్లోనే ఉంటోంది.
Read Also: Thief: సినీ నటితో ప్రేమలో పడిన దొంగ.. ఏకంగా రూ. 3 కోట్లతో ఇల్లు..
షైమాకి సజీర్ సంబంధం ఉందని, తననే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్లకు చెప్పిందని, అందుకు వారు నిరాకరించినట్లు స్థానికులు చెప్పారు. పెళ్లి ఇష్టం లేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణించిన కొద్దిసేపటికే సజీర్ తన మణికట్టుని కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడిని మంజేరిలోని మెడికల్ కాలేజీలో చేర్పించడంతో ప్రాణాపాయం తప్పింది. ఇదే మలప్పురం జిల్లాలో 25 ఏళ్ల వివాహిత విష్ణుజ ఆత్మహత్య కూడా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భర్త పెట్టే మానసిక, శారీరక వేధింపులు తాళలేక మరణించింది. భర్త ప్రభిన్ తరుచుగా విష్ణుజని అందంగా లేవని, ఉద్యోగం లేదని వేధించేవాడని తేలింది.