Site icon NTV Telugu

MahaRastra Govt Hospital: ప్రభుత్వాసుపత్రిలో ఒక్క రోజే 18 మంది మృతి.. మహారాష్ట్రలోని థానేలో ఘటన

Maharastra

Maharastra

MahaRastra Govt Hospital: సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రులకు పేదలు వస్తుంటారు. అందులో పెద్ద వయస్సు వారు కూడా ఉంటారు. ప్రభుత్వ ఆసుపత్రులకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కూడా వస్తుంటారు. కొన్నిసందర్భాల్లో సీరియస్‌ అయిన తరువాత ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటారు. మహారాష్ట్రలోని ప్రభుత్వాసుపత్రిలో ఒక్క రోజే 18 మంది మరణించారు. మరణించిన వారిలో 10 మంది మహిళలు ఉన్నారు. మరణించిన వారిలో కొందరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు. జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించారు. ఒక్క రోజులోనే 18 మంది మరణించడంతో ఆసుపత్రి దగ్గర ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Read also: BEL Recruitment 2023: బీఈఎల్ లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

మహారాష్ట్రలోని థానే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో 24 గంటల్లో 18 మంది రోగులు మరణించారు. మృతుల్లో పది మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారు. మృతుల్లో థానే నగరానికి చెందినవారు ఆరుగురు ఉండగా.. కల్యాణ్‌కు చెందినవారు నలుగురు, షాపూర్‌ నుంచి ముగ్గురు, భీవాండి, ఉల్హాస్‌నగర్‌, గోవండి (ముంబయి) నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందని మున్సిపల్‌ కమిషనర్ అభిజిత్ బంగర్ తెలిపారు. మృతుల్లో 12 మంది 50 ఏళ్లు పైబడిన వారు ఉన్నారని.. స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆదేశించారని అభిజిత్ బంగర్ వెల్లడించారు. కమీషనర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నేతృత్వంలోని కమిటీ, ఈ మరణాలకు సంబంధించిన క్లినికల్ అంశాలపై దర్యాప్తు చేస్తుందని ప్రకటించారు. మరణించిన రోగులు మూత్రపిండాల్లో రాళ్లు, దీర్ఘకాలిక పక్షవాతం, అల్సర్‌లు, న్యుమోనియా, కిరోసిన్ పాయిజనింగ్ నుండి సెప్టిసిమియా వరకు వివిధ వైద్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారని అభిజిత్ బంగర్ చెప్పారు. మరణించిన వారికి అందించిన చికిత్స మరియు మరణించిన వారి బంధువుల నుంచి వివరాలు తీసుకుంటారని.. విచారణ కమిటీ పూర్తిగా పరిశీలించిన నివేదికను ఇవ్వనుందని అభిజిత్ బంగర్ చెప్పారు. థానే మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు రికార్డులను పరిశీలించనున్నారు. డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ గణేష్ గావ్డే మాట్లాడుతూ, “కొంతమంది రోగులు క్రిటికల్ స్టేజ్‌లో ఉన్నారని మరియు చికిత్స పొందుతూ మరణించారని ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది. మరికొందరు వృద్ధులు ఉన్నారు…ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆసుపత్రిలో పోలీసులను పెంచామని తెలిపారు. ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర మంత్రి అదితి తత్కరే మరణాలపై విచారం వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

Exit mobile version