Maha Kumbh Mela: కుంభమేళాలో మరో రికార్డ్! చీపురుపట్టిన 15 వేల మంది కార్మికులు
- కుంభమేళాలో మరో రికార్డ్!
- చీపురుపట్టిన 15 వేల మంది కార్మికులు
- 3 రోజుల్లో గిన్నిస్ రికార్డ్‌లోకి ఎక్కే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా కుంభమేళా మరో రికార్డ్ సృష్టించబోతుంది. ఇప్పటికే 60 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేసి రికార్డ్ సృష్టించగా.. తాజాగా ఒకేసారి 15 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ డ్రైవ్ చేపట్టారు. ఈ పరిణామం గిన్నిస్ రికార్డ్ దిశగా సాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలో నాలుగు జోన్‌ల్లో కార్మికులు క్లీన్ డ్రైవ్ చేపట్టారు. ఒకేసారి 15,000 మంది పారిశుధ్య కార్మికులు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పడానికి ప్రయత్నించారు. అయితే ఈ రికార్డు యొక్క తుది ఫలితాలను ఫిబ్రవరి 27న ప్రకటించే అవకాశం ఉంది. పారిశుధ్య కార్మికులను వారి రిస్ట్‌బ్యాండ్‌లపై ఉన్న కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లెక్కించారు.
ఇది కూడా చదవండి: Bangladesh : బంగ్లాదేశ్ లో మారుతున్న పవనాలు.. ఎన్నికల్లో గెలిచిన షేక్ హసీనా మద్దతుదారులు
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు, ప్రయాగ్‌రాజ్ మేయర్ గణేశ్ కేసర్వాని, మహాకుంభమేళా ప్రత్యేక ఈవో ఆకాంక్ష రాణా పర్యవేక్షించారు. రికార్డుకు సంబంధించిన తుది నివేదిక మూడు రోజుల్లో వెలువడనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 2019లో కూడా ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాలో 10 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకున్నారు.
ఇది కూడా చదవండి: Shivaratri New Song 2025: శివరాత్రి స్పెషల్ సాంగ్.. ‘దేవ దేవ శంకర దేవ శంభో శంకరా..’
ఇదిలా ఉంటే మహా కుంభమేళా జనవరి 13న మొదలుకాగా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఇప్పటి వరకు 60 కోట్లకు మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు యోగి ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినం కావడంతో భక్తుల రాక మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Maha Shivratri 2025: శివరాత్రి రోజున జాగరణ, ఉపవాసం ఎందుకు ఆచరిస్తారంటే!
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!