NTV Telugu Site icon

12 మంది కేంద్రమంత్రుల రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం..

ministers resign

ministers resign

కేంద్ర కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ సమయంలో మంత్రివర్గంలోని సీనియర్లకు షాక్‌ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ… కొత్తవారికి అవకాశం ఇస్తూనే.. కొందరు పాతవారికి ప్రమోషన్లు ఇచ్చిన ప్రధాని.. ఏకంగా 12 మంది కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించడం సంచలనంగా మారింది.. కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా తమ పదవులు కోల్పోయారు.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హ‌ర్షవ‌ర్దన్, విద్యాశాఖ మంత్రి ర‌మేష్‌ పోఖ్రియాల్‌, సంతోష్ గాంగ్వర్‌, స‌హాయ మంత్రులు రావ్ సాహెబ్ ధాన్వే పాటిల్‌, విద్యాశాఖ స‌హాయ‌మంత్రి సంజ‌య్ దోత్రే, బాబుల్ సుప్రియో, సదానంద గౌడ, థావర్‌చంద్ గెహ్లాట్, రతన్ లాల్ కటారియా, ప్రతాప్ చంద్ర సారంగి.. ఇక, వారి రాజీనామాలకు ఆమోదం తెలిపారు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్. ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రుల రాజీనామాలు వెంటనే అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది.