NTV Telugu Site icon

Bihar bridges collapsed: నితీష్ సర్కార్ యాక్షన్.. 16 మంది ఇంజనీర్లు సస్పెండ్

Bihar

Bihar

బీహార్ రాష్ట్రంలో వరుసగా వంతెనలు కూలిపోవడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రెండు వారాల్లో 12 బ్రిడ్జిలు కూలిపోయాయి. దీంతో రాజకీయంగా నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

ఇది కూడా చదవండి: Terrorist Died: ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన టెర్రరిస్ట్ మృతి..

వరుసగా వంతెనలు కూలిపోవడంపై నితీష్ సర్కార్ కమిటీని వేసింది. తాజాగా దీనికి బాధ్యులైన 16 మంది ఇంజనీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే నితీష్ కుమార్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కొత్త వంతెనల పునర్నిర్మాణానికి కూడా ఆదేశించింది. నిర్మాణ వ్యయాన్ని దోషులుగా గుర్తించిన కాంట్రాక్టర్లపై విధించనున్నారు. వంతెనలు కూలిపోవడానికి ఇంజనీర్ల నిర్లక్ష్యం, పర్యవేక్షణ అసమర్థమేనని పేర్కొంటూ ఫ్లయింగ్ స్క్వాడ్‌లు తమ నివేదికలను సమర్పించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: UK-INDIA: నూతన బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్..బ్రిటన్‌-భారత్ మధ్య సంబంధాల పరిస్థితేంటి..?

రాష్ట్ర జలవనరుల శాఖ అదనపు ముఖ్యకార్యదర్శి చైతన్యప్రసాద్ మాట్లాడుతూ.. ఇంజనీర్లు సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని, ఈ ఘటనల వెనుక కాంట్రాక్టర్ల అశ్రద్ధ కారణమని పేర్కొన్నారు. గురువారం బీహార్‌లోని సరన్ జిల్లాలో మరో వంతెన కూలిపోవడంతో గత 17 రోజుల్లో ఇటువంటి సంఘటనల సంఖ్య పన్నెండుకు చేరింది.

ఇది కూడా చదవండి: Hero Raj Tarun : లావణ్య అసలు రూపం ఇదే