monkeys died while being transported in an auto rickshaw: ఒడిశాలోని గంజాం జిల్లాలో అమానుష సంఘటన జరిగింది. కోతులను సంచుల్లో బంధించి ఆటోలో తరలిస్తున్న సమయంలో మరణించాయి. దీనికి కారణం అయిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గంజాం జిల్లా జరదగడ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో పోలీసులకు కోతులతో ఇద్దరు పట్టుబడ్డారు. వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్న సమయంలో వాహనం నుంచి శబ్ధాలు రాగా..అనుమానించిన పోలీసులు వాహనంలో చూడగా.. ఎనిమిది సంచుల్లో కోతులు కనిపించాయి.
మొత్తం 8 సంచుల్లో 15 కోతులను తరలిస్తుండగా.. అప్పటికే అందులో 10 చనిపోయాయి. మరో 5 కోతులను అధికారులు రక్షించారు. కోతులు ఊపిరి ఆడకచనిపోయాయని బెర్హాంపూర్ డీఎఫ్ఓ అమ్లాన్ నాయక్ తెలిపారు. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు అధికారులు.
Read Also: Nikhil: నిఖిల్ కు గట్స్ లేవు.. సినిమా రిలీజ్ తో అతడికేంటి పని.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
అరెస్ట్ అయిన వారిని ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా వెంకటాపురానికి చెందిన రమేష్ సింగ్(20), పూసల్ నాగరాజు(23)గా గుర్తించారు. తమ ప్రాంతంలో కోతుల బెడదతో విసుగు చెందిన వారు వీటిని పట్టుకుని ఒడిశా దాటి అడవుల్లో విడిచిపెట్టాలని భావించినట్లు అధికారులు తెలిపారు. చనిపోయిన కోతులు రెసస్ మకాక్ కోతి జాతికి చెందినవి.. షెడ్యూల్-2 జంతువులు కావడంతో వీరిద్దరిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేశారు అధికారు. ఈ కేసును విచారణ జరుపుతున్నట్లు సామంతిపల్లి రేంజ్ అధికారి మనోజ్ కుమార్ పాత్ర వెలిపారు.