Site icon NTV Telugu

Maha Kumbh Mela: ప్రయాగ్‌రాజ్‌లో రోడ్డుప్రమాదం.. 10 మంది భక్తుల మృతి

Accidentup

Accidentup

మహా కుంభమేళాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులతో వెళ్తున్న బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది భక్తులు మృతిచెందారు. మరో 19 మంది గాయపడ్డారు.

ఇది కూడా చదవండి: Mother Killed Son: వ్యసనాలకు బానిసైన కొడుకును చంపిన తల్లి.. కేసులో బిగ్ ట్విస్ట్!

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగంలో స్నానం చేసేందుకు వెళ్తున్నారు. అయితే ప్రయాగ్‌రాజ్-మిర్జాపూర్ హైవేలోని మేజా ప్రాంతంలో బొలెరో కారు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోగా.. 19 మంది గాయపడ్డారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం స్వరూప్ రాణి మెడికల్ హాస్పిటల్‌కు తరలించారు. తదుపరి ప్రక్రియ కొనసాగుతోందని డీసీపీ వివేక్ చంద్ర యాదవ్ తెలిపారు.

ఇది కూడా చదవండి: Hyderabad: జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర కారు బీభత్సం.. పోలీస్ బూత్ ధ్వంసం

సమాచారం అందుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే బాధితులకు సహాయక చర్యలను వేగవంతం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన రోడ్డుప్రమాదంలో తెలంగాణకు చెందిన భక్తులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

Exit mobile version