దేశ రాజధాని ఢిల్లీలో ఓ పాత బిల్డింగ్ కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఒకరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారేమోనన్న ఉద్దేశంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
గత రెండ్రోజులు ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం కూడా భారీ వర్షం కురిసింది. దీంతో మోడల్ టౌన్ ఏరియాలో ఓ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. ఇద్దరిని రక్షించారు. మరికొంత మంది కోసం సెర్చ్ చేస్తున్నారు. సహాయ చర్యలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి.
కూలిపోయిన భవనం పాత బిల్డింగ్ అని పోలీసులు తెలిపారు. ఈ భవనంపై టెలిఫోన్ టవర్ కూడా ఉండడంతో వర్షానికి కూలిపోయిందని చెప్పారు. ఒకరు చనిపోగా.. ముగ్గురిని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇక అంబా స్కూల్ సమీపంలోని అపార్ట్‌మెంట్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.