Site icon NTV Telugu

ఒకే గ్రామంలో 40 మంది కరోనా కాటుకు బలి

దేశంలో కరోనా కల్లోలానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. రోజు రోజుకు కేసులు, మృతుల సంఖ్య ప్రభుత్వాలకు సవాల్ విసురుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కాగా కర్ణాటకలోని విజయపుర జిల్లా తొరవి గ్రామంలో కరోనా రెండో దశ మొదలైన నాటి నుంచి 70 మంది కొవిడ్​ కాటుకు బలయ్యారు. అందులో 40 మంది ఒక్క నెలలోనే కరోనాతో చనిపోవడం ఆ గ్రామాన్ని కలవరపెడుతుంది. మాజీ మంత్రి ఎమ్​బీ పాటిల్​ ఈ విషయం వెల్లడించారు. పాటిల్​ ఈ విషయాన్ని చెప్పిన తర్వాత వెంటనే ఆరోగ్యశాఖ అధికారులు గ్రామాన్ని సందర్శించి కరోనా పరీక్షలు చేపట్టారు.

Exit mobile version